ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ట్రాన్స్​జెండర్లకు ట్రాఫిక్‌ డ్యూటీ - హైదరాబాద్​ ప్రధాన కూడళ్లలో 44మంది - TRANSGENDERS IN TRAFFIC DUTIE

హైదరాబాద్​లో 44 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్‌ నియంత్రణ విధులు చేపట్టనున్నారు.

transgenders_to_join_traffic_duties_from_today_in_hyderabad
transgenders_to_join_traffic_duties_from_today_in_hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2024, 1:49 PM IST

Transgenders to join Traffic Duties From Today in Hyderabad :హైదరాబాద్​ నగర పోలీసు విభాగం ట్రాఫిక్‌ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లు కూడా భాగస్వాములు కానున్నారు. తొలి దశలో భాగంగా మొత్తం 44 మంది ట్రాన్స్‌జెండర్లు నగరంలోని వివిధ కూడళ్లలో వాహనాలను నియంత్రిస్తారు. నగర పోలీసులు దీన్ని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌లో ఎంపికైన ట్రాన్స్‌జెండర్ల డ్రిల్‌ను కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే మరింత మందిని విధుల్లోకి తీసుకుంటామని, ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీవీ ఆనంద్‌ అన్నారు.

సొంతకాళ్లపై నిలబడుతున్న ట్రాన్స్​జెండర్లు.. స్పెషల్​గా హోటల్ పెట్టి..

ABOUT THE AUTHOR

...view details