Trading Scam in Telangana: హైదరాబాద్‌లో ట్రేడింగ్ మోసాలు పెరిగిపోతున్నాయి. అధిక లాభాల కోసం ఆశపడితే అమాయకుల డబ్బు సైబర్ నేరగాళ్లకు చెంతకు చేరుతోంది. ఇటీవలే నగరంలో వెలుగుచూస్తున్న ఘటనల్లో అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండువారాల క్రితం నగరానికి చెందిన ఓ గృహిణి ఫేస్‌బుక్‌లో ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ పేరిట ఓ ప్రకటన చూసింది. అధికంగా డబ్బులు వస్తాయని నమ్మించి ఆ మహిళను ఏ7 అవినాష్స్ యునైటెడ్ బుల్స్ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. తర్వాత పెట్టుబడులు పెడితే 5 నుంచి 20 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. ముందుపెట్టిన పెట్టుబడికి అధిక లాభాలు చూపారు. వాటిని నమ్మి పెట్టుబడులు పెట్టిన ఆ మహిళకు రూ.27 లక్షల పైచిలుకు ఆదాయాన్ని వర్చువల్‌గా చూపించారు. కానీ వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో మోసపోయానని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Cyber Criminals Fraud High Interest Rates on Stocks: ఇటీవల మరో వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది. పెట్టుబడులు, ట్రేడింగ్ పేరిట నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి లక్షల్లో డబ్బు కోల్పోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాటా ఇన్వెస్టిమెంట్ ఫండ్ పేరిట మరో 20 ఏళ్ల యువకుడు మోసపోయాడు. ముందు కొంత పెట్టుబడి పెట్టించి, రెట్టింపు డబ్బులు ఖాతాల్లో జమ చేసి నమ్మించారు. అలా డబ్బుల ఆశతో భారీగా పెట్టుబడులు పెట్టాడు. తర్వాత ఆ యువకుడి నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించగా రూ.9 లక్షలు పంపిస్తేనే వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసుకోగలరని చెప్పడంతో బాధితుడు పోలీసుల ఎదుట తన గోడు వెల్లబోశాడు. గూగుల్ మ్యాప్స్‌కి రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి మరో 30 ఏళ్ల మహిళకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు.
టీజీసీఎస్‌బీ మరో ఘనత - సైబర్ నేరాల బాధితులకు ఒక్కరోజే రూ.7.9 కోట్ల అప్పగింత