ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుండపోత వర్షాలతో ఉప్పొంగిన వాగులు- కాకినాడ జలమయం - Rains in Andhra Pradesh - RAINS IN ANDHRA PRADESH

Torrential Rains Lashed Across Andhra Pradesh: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కాలవలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రహదారులపై భారీగా వర్షపు నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

rains_in_andhra_pradesh
rains_in_andhra_pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 10:42 AM IST

Torrential Rains Lashed Across Andhra Pradesh:వేసవి ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలకు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్షాలు కురవడంతో ప్రజలు పేద తీరారు. కోనసీమ జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు వచ్చి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కాలవలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు - DRAINAGE PROBLEM

Joint East Godavari District:కాకినాడలో గంటన్నరకు పైగా కుండపోత వాన కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెయిన్ రోడ్, సినిమా రోడ్, దేవాలయం రోడ్ రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. కలెక్టరేట్ ప్రాంగణాన్ని వర్షం నీరు ముంచెత్తింది. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన అమ్ముకునే పళ్లు, ఇతర వస్తువులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. కొన్ని వాన నీటిలో కొట్టుకుపోయాయి. భాస్కర్ నగర్ గోదారిగుంట సురేష్ నగర్, పోస్టల్ కాలనీ వెంకట్ నగర్ తదితర జనావాస కాలనీలను వాన నీరు చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లి. రహదారుల్ని ముంచేశాయి.

Krishna District:కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షంపడుతోంది. లోతట్టు ప్రాంతాలైన గౌడపేట, వీఎన్ పురం, ఇతర కాలనీల్లోకి వరద నీరు చేరింది.

అంతా తవ్వుకుపోయాక హడావుడి- సుప్రీం ఆదేశాలతో గనులశాఖ ఉన్నతాధికారుల హైడ్రామా - SC Serious On Sand Mining in AP

Anantapur District:అనంతపురం జిల్లా ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు జలమయమయ్యాయి. ఉరవకొండ ఇంద్రనగర్​లో భారీగా వర్షపు నీరు ప్రవహించాయి. పలు మండలాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలచిపోయింది. చీకటిలో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. కళ్యాణదుర్గంలో కురిసిన వర్షానికి పట్టణంలోని విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 8 గంటల నుంచి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

పట్టణంలో పదికి పైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వర్షం ధాటికి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి చెరువు మరువ పారుతోంది. విడపనకల్లు మండలంలోని 19 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. పెంచులపాడు - పొలికి, పాల్తూరు - గోవిందవాడ గ్రామాల మధ్య వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలచిపోయాయి. పొలాలు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి.

ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASE

ABOUT THE AUTHOR

...view details