జీవితంలో ఒక్కరోజైనా ఆయనలా బతకాలి - రామోజీకి టాలీవుడ్ సంగీత ప్రపంచం ఘననివాళి (ETV Bharat) Telugu Music World Pays Tribute to Ramoji Rao : రామోజీరావుకు సంగీతమంటే ప్రాణమనే చెప్పాలి. ఎందుకంటే ఈటీవీ ప్రసారాల్లో సంగీతానికి ప్రథమ స్థానం ఉంటుంది. పాడుతా తీయగా కార్యక్రమంతో దేశంలోనే అత్యంత నాణ్యమైన సంగీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పుడు వ్యాఖ్యాతగా దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఉండేవారు.
సినీ ప్రపంచంలోని దాదాపు గాయనీగాయకులు అంతా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారానే. ఏ సభలో మాట్లాడిన రామోజీరావు ప్రత్యేకంగా సంగీతం గురించి మాట్లాడతారు. అది తనకు ఉన్న అభిరుచి. అందుకే తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఉన్న దిగ్గజ సంగీత దర్శకులు, గాయనీ గాయకులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా పలువురు సంగీత దర్శకులు, గాయకులు రామోజీ ఫిలిం సిటీ చేరుకుని రామోజీకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సినీ సంగీత దర్శకులు, గాయకులు నివాళులు :
ఇళయరాజా : సినీ సంగీత దిగ్గజం ఇళయరాజా రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
ఎంఎం కీరవాణి : 'బతికితే ఒక్కరోజైనా రామోజీరావు గారిలా మనిషన్నవాడు బతకాలని అంటుంది నా భార్య' అంటూ రామోజీరావు గురించి సందర్భం వచ్చినప్పుడల్లా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అంటుంటారు. రామోజీరావు మరణవార్త వినగానే కుంగిపోయాయని చెప్పారు. రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తన అభిమానాన్ని మనసులో దాచుకోలేక భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.
చంద్రబోస్ : సినీ రచయిత చంద్రబోస్ కూడా రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న పరిచయాలను గుర్తు చేసుకున్నారు.
ఎస్పీ చరణ్ : రామోజీరావు కుటుంబానికి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబానికి విడదీయని అనుబంధం ఉంది. రామోజీరావు నిర్మాతగా వహించిన మయూరి చిత్రానికి బాలసుబ్రహ్మణ్యమే సంగీత దర్శకుడు. ఆ తర్వాత రామోజీ ఆలోచనల నుంచి వెలువడిన పాడుతా తీయగాతో వీరి స్నేహ బంధం ఎల్లలు దాటింది. ఆ తర్వాత ఎస్పీ బాలు చనిపోయిన తర్వాత కూడా అతని కుమారుడు ఎస్పీ చరణ్‌తో పాడుతా తీయగా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ నేటికీ చాలా మంది గాయకులను తయారు చేసింది. రామోజీ మృతిపై ఎస్పీ చరణ్ నివాళులు అర్పించి, తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
గాయని సునీత : ఈటీవీతో గాయని సునీతకు ఉన్న బంధం చాలా ప్రత్యేకం. ఆమె ఈ ఛానెల్‌లో చాలా ప్రోగ్రామ్స్‌కు జడ్జిగా మరికొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. రామోజీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలగజేసిందని సునీత అన్నారు. రామోజీ మరణవార్త తనను ఎంతో కలచివేసిందని అన్నారు. రామోజీరావు ఒక మహాప్రస్థానం అంటూ కొనియాడారు. రామోజీరావు విలువకు నిదర్శనమని అన్నారు.
సినీ సంగీత దర్శకుడు కోటి :ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతిపట్ల సినీ సంగీత దర్శకుడు కోటి నివాళులు అర్పించారు. సినీ ప్రపంచంలో రామోజీరావు ప్రస్థానం గురించి గుర్తు చేసుకున్నారు.
మా లాంటి ఎంతో మంది నటులను పరిచయం చేశారు - రామోజీకి సినీ హీరోల నివాళులు - TELUGU ACTORS TRIBUTE TO RAMOJI RAO
అక్షర యోధుడి కోసం నడిచివచ్చిన అవార్డులు - eenadu chairman Ramoji Rao Received Awards