Mahesh Babu Family Visit in Tirumala By Steps Way : శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గాన మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
Actor Varun Tej and Lavanya Tripathi Visit Tirumala : తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, సతీమణి లావణ్య త్రిపాఠి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం తర్వాత వరుణ్ తేజ్ దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.