Pet Dog Theft in Telangana:పెంపుడు జంతువులను పెద్దపెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు చాలా మంది ప్రేమగా పెంచుకుంటారు. వారికి ఎంత పని ఉన్నా వాటికి కొంత సమయం కేటాయిస్తుంటారు. ఈ జాబితాలో కుక్కలది ప్రత్యేక స్థానం. మూగ జీవాలలో అత్యంత విశ్వాసమైన జంతువుల్లో కుక్కకే మొదటి ప్రాధాన్యం. అందుకే కుక్కలను ప్రేమతో పెంచుకుంటారు. కొంతమంది అయితే పెంపుడు కుక్కలను ఇంట్లో మనిషిలా చూస్తుంటారు. అలాంటి పెంపుడు కుక్కలకు బయట మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే అదే రీతిలో వీటిని దొంగలించే వారు ఉన్నారు. డబ్బుల కోసం బయట అమ్ముకునేందుకు కొందరు, పెంచుకునేందుకు మరికొందరు ఇలా చోరీలకు పాల్పడుతుంటారు.
వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హచ్ బ్రీడ్‌కు చెందిన పెంపుడు కుక్క చోరీకి గురైంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న అప్పరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కను శనివారం(నవంబర్ 2)న గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి దొంగిలించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న హచ్ కుక్కను చూసి దానిని ఎత్తుకెళ్లిపోయారు.
"చెన్నై ఎక్స్‌ప్రెస్ మర్డర్ స్టోరీ" - తండ్రీ, కూతురు కలిసి మృతదేహాన్ని ముక్కలు కోసి!