Thieves Stole Cash from a Parked Car in Ongole:ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాలుకా పోలీసుల వివరాల మేరకు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపి, వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించి పరిశీలించగా అందులో కేవలం రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. రూ.500 నోట్ల కట్టలు కనిపించలేదు.
మార్తాడులో పట్టపగలే చోరీ - 40 తులాల బంగారం, రూ.2 లక్షలు అపహరణ