తెలంగాణ

telangana

ETV Bharat / state

సండే "మారథాన్​"లో పాల్గొనాలనుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ఆరోగ్యానికి నష్టం తప్పదట!

ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ వ్యాయామం అవసరం - వీకెండ్స్​లో మారథాన్​లో పాల్గొనాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి!

TIPS FOR MARATHON RUNNERS
Marathon Tips for Beginners (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Marathon Tips for Beginners in Telugu : ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే వయసుతో సంబంధం లేకుండా జాగింగ్, రన్నింగ్‌.. వంటివి సాధన చేస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి వీకెండ్స్​లో నిర్వహించే మారథాన్‌లలోనూ పాల్గొంటున్నారు. నిజానికి పరుగు వల్ల ఆరోగ్యానికి శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మొదటిసారి మారథాన్‌లలో పాల్గొనే వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అప్పుడే గాయాల బారిన పడకుండా చూసుకోవచ్చంటున్నారు. మరి, ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మారథాన్‌లో పాల్గొనే ముందు ఎవరైనా ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ముందు ఓసారి హెల్త్ చెకప్‌ చేయించుకొని, డాక్టర్‌ సలహాలు తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇలా శారీరకంగా సిద్ధంగా ఉన్నప్పుడే గాయాల పాలయ్యే ప్రమాదం తగ్గుతుందంటున్నారు.

వార్మప్‌ తప్పనిసరి! : వ్యాయామానికి ముందుగా ఏవిధంగానైతే వార్మప్ చేస్తామో, అలాగే మారథాన్​కు సిద్ధమయ్యేముందు వార్మప్ తప్పనిసరిగా చేయాలంటున్నారు నిపుణులు. ఫలితంగా ఆయాస పడకుండా ఉండడంతో పాటు, గాయాల పాలయ్యే ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవచ్చంటున్నారు. అయితే, వార్మప్‌లో భాగంగా కండరాలు, కీళ్ల సామర్థ్యాన్ని పెంచేలా డైనమిక్‌ స్ట్రెచెస్‌ వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వడం బెటర్ అంటున్నారు.

లక్ష్యాన్ని నెమ్మదిగా పెంచుకోవాలి : మొదటిసారి మారథాన్​లో పాల్గొనే వారు వేగంగా, తొందరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఫలితంగా మోకాళ్ల నొప్పులు, కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచే మారథాన్‌కు ప్రిపేర్ కావాలంటున్నారు. ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌ చేసేటప్పుడు ఒకేసారి లక్ష్యానికి గురిపెట్టకుండా కొద్దికొద్దిగా లక్ష్యాన్ని చేరుకునేలా సాధన చేయాలని సూచిస్తున్నారు.

ఉదాహరణకు, మీరు మొదటి వారమంతా కిలోమీటర్‌ రన్నింగ్‌ ప్రాక్టీస్ చేస్తే, నెక్ట్ వీక్ అదనంగా మరో కిలోమీటర్‌ యాడ్ చేసుకొని రెండు కిలోమీటర్లు పరిగెత్తేలా సాధన చేయాలి. ఇలా పెంచుకుంటూ పోయినప్పుడు లక్ష్యసాధన ఈజీ అవ్వడమే కాకుండా.. గాయాల బారిన పడే ఛాన్సెస్ కూడా తగ్గుతాయంటున్నారు నిపుణులు.

సరైన పోషకాహారం :మారథాన్‌ ప్రాక్టీస్​లో భాగంగా రన్నింగ్‌ చేయడం వల్ల బాడీలో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతుంటాయి. అందుకు తగిన విధంగా ఫుడ్ తీసుకుంటేనే శరీరం తిరిగి దృఢంగా, ఉత్సాహంగా తయారవుతుంది. అందుకే తీసుకునే ఆహారంలోనూ పలు మార్పులు, చేర్పులు చేసుకోవడం అవసరమంటున్నారు. ముఖ్యంగా డైట్​లో కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉండేందుకు తగినన్ని వాటర్ తాగడం కూడా ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు.

మానసికంగా దృఢంగా ఉండాలి :రన్నింగ్‌ చేసేటప్పుడు కేవలం శారీరకంగానే కాదు, మానసికంగానూ దృఢంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇతరులతో మాట్లాడేటప్పుడూ సానుకూల అంశాలకే ప్రాధాన్యమిచ్చేలా చూసుకోవాలంటున్నారు.

అందుకోసం ఇవి ప్రాక్టీస్ చేయాలట! :కొంతమంది మారథాన్‌ అనగానే వార్మప్‌ చేసి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ, శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలంటే మారథాన్​తో పాటు సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బరువులెత్తే వ్యాయామాలు వంటివీ వర్కవుట్‌ రొటీన్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. తద్వారా శరీరంలోని కండరాలు దృఢంగా మారడంతో పాటుగా పూర్తి ఫిట్‌గా తయారుకావచ్చంటున్నారు.

ఇవీ చదవండి :

వీకెండ్​లో వాకింగ్ ఎక్కువ చేస్తున్నారా? - అయితే నష్టం తప్పదట! ఎందుకో తెలుసా?

హెచ్చరిక : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? - ఆరోగ్యానికి తీవ్ర ముప్పు - వారానికి ఇంతే తగ్గాలి!

ABOUT THE AUTHOR

...view details