Six Members Died in Road Accident in Tadipatri : టైరు పగలి లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలోని శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టైరు పగిలిన క్రమంలో అదుపుతప్పిన కారు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి దాని కిందకు దూసుకెళ్లినట్లు సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో కారులో ఉన్నవారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. మృతులు తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇవాళ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోని శింగనమల మండలంలో నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో కారు టైరు పగలడంతో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తాడిపత్రిలో నగర సంకీర్తన వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయగా అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి : ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, రోడ్డు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కారు లారీ కిందకు దూసుకెళ్లడంతో వాహనం నుజ్జునుజ్జు అయింది. దీంతో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు జేసీబీ సాయంతో బయటకు తీశారు. మృతులు సంతోష్, షణ్ముఖ, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు.
మరోవైపు అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందడంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంపై ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తండ్రి మరణం, కుమారుడి జననం - గద్వాల జిల్లాలో హృదయాన్ని మెలిపెట్టే విషాదం
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు అదుపుతప్పింది - బతుకమ్మ కుంటలోకి దూసుకెళ్లింది