ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిబ్రవరిలో గ్రూప్​ -1 ఫలితాలు విడుదల - GROUP RESULTS IN TELANGANA

టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు ఫిబ్రవరి లో విడుదల- దీని తర్వాతే మిగతా పోస్టులకు

TELANGANA GROUP RESULTS IN FEBRUARY
TGPSC ON THE WAY TO UPSC (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2024, 11:38 AM IST

GROUP RESULTS IN Telangana:తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన ప్రధాన పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని భావిస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్-1 లో అమలు చేసి ఫిబ్రవరి 19 లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది.

1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా:మార్కుల్లో మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు కనీసం మరో మూడు నెలల సమయం అవసరమని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19 న జారీ చేసింది. 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 9 న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ ప్రధాన పరీక్షలకు 1:50 నిష్పత్తి 31,382 మంది అభ్యర్థులకు ఎంపిక చేసింది. ఉన్నత న్యాయస్థానం అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 21,093 మంది 7 పేపర్ల పరీక్షలు చేశారు. అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం నవంబరు 2 వ వారంలో ప్రారంభమైంది. ఒక్కో పేపరును రెండు సార్లు మూల్యాంకనం చేస్తారు. ఒక అభ్యర్థి జవాబు పత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు రెండో దశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం నిర్వహించి మార్కులు ఖరారు చేస్తారు. అనంతరం మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను కమిషన్ రూపొందిస్తుంది.

గ్రూప్-1 తర్వాతే అన్ని పోస్తులు: గ్రూప్ పోస్టులకు పోటీ ఎక్కువ ఉంటుంది. ఇటీవల నియామకాల్లో తుదిఫలితాల వెల్లడిలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో, ఒకే అభ్యర్థి రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్నత స్థాయిలోని పోస్టులను ఎంచుకోవడంతో కింది స్థాయి పోస్టులు బ్యాక్ లాగ్ గా మిగిలిపోయాయి. ఇలా గురుకులాల్లోనే దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్ లాగ్ కిందకు వచ్చాయి. భవిష్యత్ లో బ్యాక్ లాగ్ కాకుండా ఉండేందుకు రీలింక్విష్మెంట్ విధానంపై అధ్యయనం చేయాలని ఇటీవల మంత్రిమండలి నియామక సంస్థలకు సూచించింది. గ్రూప్ పోస్టుల్లో అవరోహణ విధానం అమలుపై కమిషన్ సమాలోచనలు చేస్తోంది. గ్రూప్-3 రాతపరీక్షలు పూర్తయ్యాయి. వచ్చే నెలలో గ్రూప్-2 రాతపరీక్షలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరిలో గ్రూప్-1 ఫలితాలు వెల్లడించిన తరువాతే గ్రూప్-2,3 ఫలితాలిస్తే బ్యాక్ లాగ్ రాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని కమిషన్ భావిస్తోంది.

రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 సర్వీసులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించింది. జిల్లా, రాష్ట్రస్థాయి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను సంబంధిత విభాగాలకు కమిషన్ పంపించింది. ఈ మేరకు జిల్లా, రాష్ట్రస్థాయి యంత్రాంగం ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. వారం, పది రోజుల్లో తుది పరిశీలన పూర్తి చేసి వెనువెంటనే సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

జాబ్‌ క్యాలెండర్‌ మేరకే కొలువుల భర్తీ- త్వరలోనే ప్రభుత్వానికి కమిటీ నివేదిక - APPSC Experts Committee Proposals

'గ్రూప్-2 మెయిన్స్‌ వాయిదా వేయండి' - అభ్యర్థుల విజ్ఞప్తికి ఏపీపీఎస్సీ పరిశీలన

ABOUT THE AUTHOR

...view details