ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు షికారు - వింటర్​లో మంచి థ్రిల్ ఇచ్చే టూర్

లక్నవరం జలాశయానికి విభిన్న రకాల బోట్లు - దీపావళి సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులు

Laknavaram Lake Boating
బోటులో షికారు చేయాల‌నుకుంటున్నారా? - అయితే వింటర్​లో మంచి థ్రిల్ ఇచ్చే టూర్ ఇదే! (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 2:46 PM IST

Updated : Nov 4, 2024, 9:40 PM IST

Laknavaram Lake Boating :పర్యాటకదామం లక్నవరం మరిన్ని హంగులతో పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. సహజసిద్ధ అందాలతో అనుభూతులు పంచే ఈ పర్యాటక కేంద్రంలో వాటర్‌ గేమ్స్‌, అత్యాధునిక బోట్లు ఆహ్వానం పలుకుతున్నాయి. లాహిరి, లాహిరి అంటూ నీటిపై విహరిస్తూ సందర్శకులు మైమరిచిపోతున్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు తెలంగాణలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి మరో ఆకర్షణ తోడైంది. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విభిన్న రకాల బోట్లను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాటర్‌ రోలర్‌తో పాటు మూడు రకాల బోట్లు ఉన్నాయి. నీటిలో వాటర్‌ రోలర్‌తో పాటు తిరుగుతూ పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతున్నారు.

వాటర్‌ రోలర్‌ బోట్‌ (ETV Bharat)

బోటులో విహరిస్తూ ఫుల్​ ఎంజాయ్​ చేయొచ్చు :పర్యాటకులను ఆకట్టుకునేలా ఆందుబాటులోకి తెచ్చిన పల్లకీ బోటు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పల్లకీని తలపిస్తున్న బోటులో విహరిస్తూ పర్యాటకులు మైమరిచిపోతున్నారు. కాళ్లతో తొక్కితే కదిలే పెడల్‌ బోటు సందర్శకలకు ఆహ్వానం పలుకుతోంది. పాతకాలంలో మాదిరిగా తెడ్ల సాయంతో ముందుకెళ్లేలా కయాకింగ్‌ బోట్లు ప్రకృతి ఒడిలో గడిపేందుకు రా రమ్మని పిలుస్తున్నాయి.

హాయిగొలిపే పల్లకీ బోట్‌ (ETV Bharat)

పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న లక్నవరం :చుట్టూ కొండల మధ్య జలాశయంలో బోటుల్లో విహరిస్తుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిపోతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ గేమ్స్‌ ఆడుతూ పిల్లలు సంతోషంగా గడిపారని తల్లిదండ్రులు చెబుతున్నారు. లక్నవరం సరస్సుకు పర్యాటక హంగులు అద్దినప్పటికీ భోజనం, వసతిపై పర్యాటక శాఖ మరింత దృష్టి సారించాలని సందర్శకులు కోరుతున్నారు.

పెడల్‌ బోట్‌లో కాళ్లకు పనిచెబుతూ.. (ETV Bharat)

పర్యాటకుల కోసం సిద్ధమైన మూడో ద్వీపం : అలాగే పర్యాటకుల కోసం లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం ముస్తాబైంది. ఇప్పటికే సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను ఓలలాడిస్తున్న ఈ పర్యాటక ప్రాంతానికి ఇది మరో కలికితురాయి కానుంది. సుమారు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపాన్ని (ఐలాండ్‌) టీఎస్‌టీడీసీ, ఫ్రీ కోట్స్‌ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఇందులో మొత్తం 22 కాటేజీలుండగా, అందులో నాలుగింటిని కుటుంబసభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఐదు ఈత కొలనుల్లో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఈతకొలను, ఆట వస్తువులు అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంటు తదితర వసతులు కల్పించారు.

లక్నవరం జలాశయంలో తెడ్డు సాయంతో కయాకింగ్‌ బోట్‌లో (ETV Bharat)

"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!

మీరు ప్రకృతి ప్రేమికులా? - నదీ పాయల్లో పడవ ప్రయాణం - నాగాయలంక లైట్​హౌస్​ చూడాల్సిందే! - Beautiful Mangroves in Gullalamoda

Last Updated : Nov 4, 2024, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details