Car Crashed Into Pond :ఈ రోజుల్లో కారు నేర్చుకోవడం అందరికి అవసరమవుతోంది. కారు లేకుంటే బయటకు రాలేం అనే వారు ఎంతో మంది ఉన్నారు. ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు ఉంటే బైక్‌పై వెళ్లలేం. ఖచ్చితంగా కారు కావాల్సిందే.
కార్ల అవసరం పెరగడంతో డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కంపెనీల వద్ద నేరుగా నేర్చుకునేవారు కొందరైతే, డ్రైవింగ్ స్కూల్స్ వద్ద నేర్చుకునే వారు మరికొందరు. ఇదంతా ఎందుకు మన వద్ద కారు ఉంది కదా ఆల్రెడీ వచ్చిన వారు వెంట ఉంటే మనమే నేర్చుకోవచ్చు కదా అని భావించే వారు చాలామందే ఉన్నారు. అయితే ఇలా సొంతంగా నేర్చుకునే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న పెద్ద ప్రమాదం జరగడం ఖాయం. ఇలాంటి ఘటనే ఇవాళ జనగాంలో జరిగింది.
అదుపుతప్పి కుంటలోకి దూసుకెళ్లిన కారు :జనగాం పట్టణంలో ఓ వ్యక్తి పరిచయమున్న మరొకరితో కలిసిన బతుకమ్మ కుంట మైదానం వద్ద కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అయితే కొత్తగా వచ్చిన కొత్తకార్లలో పికప్ ఎక్కువ. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి పికప్‌ను సరిగా అంచనా వేయలేక పోయాడు. కంగారులో బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పి వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఎదురుగా ఉన్న బతుకమ్మ కుంటలోకి దూసుకుపోయింది.