Textbooks, Notebooks, Uniforms and Bags To Reach Students by June 12 :పాఠశాలలు తెరిచే జూన్ 12 నాటికి విద్యార్థులకు పుస్తకాలతోపాటు యూనిఫామ్, బ్యాగులు వంటివన్నీ అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2024-25 విద్యా సంవత్సరం సన్నాహక ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ 'మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా పాఠశాలలకు పుస్తకాలు తదితర వస్తువులను అందించాలి. వీటి సరఫరాపై నిత్యం ప్రత్యే కంగా పర్యవేక్షించాలి' అని సూచించారు.
CS Jawahar Reddy Review Meeting About Education Academic Year : మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూప్రభుత్వ పాఠశాలల్లో 36,54,539 మంది విద్యార్థులు ఉన్నారని, జూన్ 10లోగా విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటికే 82 శాతం పుస్తకాల ప్రచురణ పూర్తి అయ్యిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. 1 నుంచి 10వ తరగతి వరకూ బైలింగ్యూవల్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 36 లక్షల 54 వేల 539 మంది విద్యార్ధులను ఎన్రోల్ చేశామన్నారు.