Telugu film industry Donation to Help Flood Victims:తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సినీ ప్రముఖుల విరాళాలు కొనసాగుతన్నాయి. 2 రాష్ట్రాల బాధితులకు తెలుగు ఫిల్మ్‌ఛాంబర్ రూ. 25 లక్షల చొప్పున, నిర్మాతల మండలి రూ. 10 లక్షల చొప్పున, ఫిల్మ్ ఫెడరేషన్ రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాయి. వరద బాధితుల సహాయార్థం థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.
వరద ప్రాంతాల్లో ఇబ్బందులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కమిటీ నివేదిక మేరకు సహాయ కార్యక్రమాలు చేపడతామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ఇక నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబం తరఫున రెండు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు రూ. 25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. నటుడు వరుణ్ తేజ్ ఏపీ, తెలంగాణకు రూ. 5 లక్షల చొప్పున విరాళం అదించగా ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ NCC తెలుగు రాష్ట్రాలకు కోటి చొప్పున సాయం ప్రకటించింది.
"ఇలాంటి విపత్తు సమయంలో అండగా ఉండేందుకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడూ ముందుంటుంది. ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా చేయూత అందిస్తుంటుంది. డబ్బులే కాకుండా నిత్యావసరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాం." అని నిర్మాత సురేశ్ బాబు పేర్కొన్నారు.
- ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
"వరద బాధితులకు ఇప్పటికే చాలా మంది హీరోలు విరాళాలను ప్రకటించారు. మేం ఛాంబర్ తరఫున సాయం చేయాలని అనుకున్నాం. ఇండస్ట్రీలోని ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ఫెడరేషన్ నెంబర్‌కు విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం."
- నిర్మాత దిల్ రాజు.
వరద బాధితులను ఆదుకునేందుకు ఇండస్ట్రీ తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఏం ఉన్నాయో తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ముందుకు వెళ్తాం"