Telangana State Income Till May 2024 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు పన్ను ఆదాయం రూ.22 వేల కోట్లకు పైగా సమకూరింది. నిరుటితో పోలిస్తే మే నెల వరకు రూ.2 వేల 400 కోట్ల వరకు పెరుగుదల ఉంది. జీఎస్టీ ద్వారా అత్యధికంగా రూ.8 వేల 87 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ.5 వేల 459 కోట్లు ఖజానాకు చేరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 వేల 386 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్, రూ.23 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.23 వేల 147 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో పన్నుల ద్వారా వచ్చిన మొత్తం రూ.22 వేల 419 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం రూ.728 కోట్లుగా ఉంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల 097 కోట్లు వచ్చాయి.
ఈ ఏడాది రెండు నెలల్లో పన్ను ఆదాయం నిరుడితో పోలిస్తే రూ.2 వేల 400 కోట్లు పెరిగింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో పన్ను ఆదాయం స్వల్పంగా తగ్గింది. పన్నుల రూపంలో ఏప్రిల్‌లో ఖజానాకు రూ.11 వేల 464 కోట్లు రాగా, మే నెలలో ఆ మొత్తం రూ.10 వేల 954కు తగ్గింది. అత్యధికంగా జీఎస్టీ ద్వారా రూ.8 వేల 187 కోట్లు రాగా, అమ్మకం పన్ను రూపంలో రూ.5 వేల 459 కోట్లు సమకూరాయి.
Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు