ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిరిసిల్ల నేతన్న అద్భుతం - 18 లక్షల రూపాయలతో బంగారు చీర - sircilla Handloom golden saree

Golden Saree Weaves in Sircilla : తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్లా విజయ్​కుమార్ బంగారు చీరను చేనేత మగ్గంపై నేసి ఔరా అనిపించాడు. ఓ వ్యాపారవేత్త కుమార్తె వివాహం కోసం, 200 గ్రాముల బంగారంతో గోల్డ్ చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Golden Saree Weaves in Sircilla
Golden Saree Weaves in Sircilla (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 7:05 PM IST

Nalla Vijaykumar Weave Golden Saree :తెలంగాణ ఎన్నో జానపద కళలకు, హస్తకళలకు నిలయం. ముఖ్యంగా రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ ఎంతో పేరు గాంచింది. జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులను కైవసం చేసుకుంది. అగ్గిపెట్టేలో పట్టే చీరను నేసి అబ్బుర పరిచిన నేతన్నలు, తాజాగా బంగారు చీరను మగ్గంపై నేసి ఔరా అనిపించారు.

200 గ్రాముల బంగారంతో:తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె వివాహ కోసం బంగారు చీర తయారు చేయాలంటూ నల్లా విజయ్​కుమార్​ని సంప్రదించారు. చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితమే ఆర్డర్ వచ్చిందని విజయ్​కుమార్ తెలిపారు. బంగారాన్ని జరిపోవులు తీయడానికి, కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుంచి 12 రోజులు పట్టిందని ఆయన చెబుతున్నారు.

ఈ బంగారు చీర పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 49 ఇంచులు, బరువు 800 నుంచి 900 గ్రాముల వరకూ ఉంటుందన్నారు. వచ్చే నెల 17వ తేదీన వ్యాపారి కుమార్తె వివాహం కోసం ఈ చీర తయారు చేశామన్నారు. ఈ చీరలో 200 గ్రాములు బంగారాన్ని ఉపయోగించామన్నారు. ఈ చీర తయరీకి 18 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

విజయ్​కుమార్ నేపథ్యం : తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న నల్లా విజయ్ కుమార్, బంగారు చీరలను మాత్రమే కాకుండా రంగులు మారే త్రీడీ చీరను సైతం రూపొందించారు. శ్రీరామనవమి(Sri Rama Navami 2024) సందర్భంగా భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఈ త్రీడీ చీర ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువు ఉంటుంది. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో త్రీడీ చీరను తయారు చేశానని విజయ్​ తెలిపారు. ఇందుకు అప్పట్లో 48 వేల రూపాయలు ఖర్చు అయిందన్నారు. గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను, ఉంగరంలో దూరే చీరను కూడా విజయ్‌కుమార్‌ నేసి ప్రశంసలు పొందారు.

మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా పొందూరు నేత చీర - చేపముల్లే ప్రత్యేకం - Ponduru Khadi Sarees

కంచి చీరలు ఎందుకు అంత ఫేమస్​ - మీకు తెలుసా? - why Kanchipuram Sarees Popular

ABOUT THE AUTHOR

...view details