తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం - రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశం - తెలంగాణ సర్పంచుల పదవీకాలం

Telangana Sarpanch Tenure Ends Tomorrow : రాష్ట్రంలో రేపటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుండటంతో తక్షణం వారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం గ్రామ కార్యదర్శులను ఆదేశించింది. చెక్‌ బుక్కులు, డిజిటల్‌ సంతకాల "కీ"లను తీసుకోవాలని నిర్దేశించింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు.

Telangana Sarpanch Tenure Ends On January 31 2024
Telangana Sarpanch Tenure Ends

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 8:48 AM IST

రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం - రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశం

Telangana Sarpanch Tenure Ends Tomorrow: ఫిబ్రవరి ఒకటి నుంచి సర్పంచ్‎ల‌పదవీకాలం ముగుస్తుంది. ఇక పాలనను అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌ బుక్కులు, డిజిటల్‌ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున ఇవాళే వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Telangana Sarpanch Tenure Ends On February 01 2024 :ప్రస్తుతం డిజిటల్‌ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్‌ సంతకాల కీలను ఇస్తున్నారు. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ కొనసాగగా పిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి అధికారుల సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది.

గ్రామస్థుల సంకల్పం.. 15 రోజుల్లోనే ప్లాస్టిక్​కు చెక్.. ఒకే ఒక్క నినాదంతో..

Telangana Sarpanch :అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా ఉంటారు. మేజర్‌ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీవోలు, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఉపతహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మూడో తేదీన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తారు.

Gram Panchayat Special Officers Telangana :ఈ సందర్బంగా పాలన ఎలా ఉండాలో వారికి మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 2018 ఆగస్టులో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. జనవరి వరకు ఆరు నెలల పాటు కొనసాగింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారుల పాలన రావడం ఇది రెండోసారి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు తమనే పదవిలో కొనసాగించాలంటూ సర్పంచులు కోరుకుంటున్నారు. అయితే పొడిగింపుపై ప్రభుత్వం ససేమిరా అంటోంది. గత ప్రభుత్వం హయంలో సకాలంలో నిధులు రాకపోవడంతో గ్రామపంచాయతీలు అప్పుల కుప్పలాగా మారిపోయాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు తమ పదవిని పొడిగించాలన్న డిమాండ్ చేస్తున్నారు సర్పంచులు.

బీఆర్ఎస్​ నాయకులకు సర్పంచుల గురించి మాట్లాడే హక్కు లేదు : బండి సంజయ్

సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు : సీతక్క

ABOUT THE AUTHOR

...view details