ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ - ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా! - Telangana Phone Tapping Case

Telangana Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌రావు బృందం ప్రతిపక్ష పార్టీల ప్రతినిధుల ఫోన్లపై నిఘా పెట్టడమే కాకుండా పనిలో పనిగా సొంత అవసరాలను చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపైనా కన్నేసి భారీగా దండుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Telangana_Phone_Tapping_Case
Telangana_Phone_Tapping_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 9:00 AM IST

సొంత అవసరాలకు ఫోన్ ట్యాపింగ్- ప్రణీత్ టీమ్ ప్రైవేట్ దందా మామూలుగా లేదుగా!

Telangana Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో ప్రణీత్‌రావు బృందం సాగించిన ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping Case) వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వామపక్ష తీవ్రవాదంపై కన్నేసేందుకు సమకూర్చుకున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఉపయోగించారనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఎన్నికల సమయంలో పట్టుకున్న డబ్బులో ప్రతిపక్షాలకు చెందినదే ఎక్కువగా ఉంది.

Praneeth Rao Phone Tapping Case :ఫోన్‌ ట్యాపింగ్‌ద్వారానే ఇది సాధ్యమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే ప్రణీత్​రావుబృందం తన సొంత ప్రయోజనాలకు కూడా ట్యాపింగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్​తో హవాలా, స్థిరాస్తి వ్యాపారాలపై నిఘా పెట్టి భారీగా డబ్బు దండుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

శాసనసభ ఎన్నికల (Telangana Assembly Elections 2024) వేళ పోలీసు తనిఖీల్లో దాదాపు 350 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎక్కువమొత్తం హవాలా వ్యాపారానికి సంబంధించినదే. 300 కిలోల బంగారం, వెయ్యి కిలోల వెండి కూడా స్వాధీనం చేసుకున్నారు. హవాలా మార్గంలో సొత్తు రవాణా చేసే వారినే ప్రణీత్‌రావు బృందం లక్ష్యంగా చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా డబ్బు కనుక ఎవరూ ఫిర్యాదు చేయరు. పట్టుకున్న డబ్బులో దొరికినంత దండుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి లోతుగా విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో నేరం అంగీకరించిన నింధితులు- రేపు కస్టడీకి కోరనున్న పోలీసులు - SIB Ex DSP Praneeth Rao Case

Phone Tapping Case News :ఇంకా అనేక రకాలుగా ట్యాపింగ్‌ను వాడుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై కూడా నిఘా పెట్టినట్లు, ముఖ్యంగా పలువురు స్థిరాస్తి వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇదే కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీఐ స్థాయి అధికారి పేరు కూడా వినిపిస్తోంది. ఈ అధికారి నల్గొండకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇలాంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు.

ఈ కేసులో అరెస్టయిన ముగ్గుర్నీ విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానంలో ఇవాళ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తొలుత అరెస్టయిన డీఎస్పీ ప్రణీత్‌రావును ఇప్పటికే ఏడు రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ప్రణీత్‌ను మరోసారి కస్టడీకి అడగనున్నారు. ఆయనతోపాటు అరెస్టయిన అదనపు ఎస్పీ భుజంగరావు, డీఎస్పీ తిరుపతన్నలను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక మలుపు - ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్​ - SIB Ex DSP Praneeth Rao Case

ABOUT THE AUTHOR

...view details