ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవి ఉంటే పథకాలు నిలిచిపోతాయా ? - మంత్రి ఏమన్నారంటే ​! - MINISTER ON SAMAGRA KUTUMBA SURVEY

తెలంగాణలో కొనసాగుతున్న ఇంటింటి కుటుంబ సర్వే - అక్కడక్కడ వివరాలు ఇవ్వని ప్రజలు

telangana_minister_ponnam_prabhakar_about_samagra_kutumba_survey
telangana_minister_ponnam_prabhakar_about_samagra_kutumba_survey (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 3:53 PM IST

Telangana Minister Ponnam Prabhakar About Samagra Kutumba Survey : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్​ 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వేలో ఎన్యూమరేటర్లకు కొన్ని చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్​లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వమని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఈ క్రమంలోనే సర్వేలో ఫ్రిడ్జ్​​లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు సోషల్​ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించిన ఆయన ఈ ప్రచారాలను ఉద్దేశించి మాట్లాడారు.

సర్వే సమాచారాన్ని గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందన్నారు. ఈ సమాచారం సేకరించడంతో ఎవరికీ కూడా ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవని స్పష్టం చేశారు.సేకరిస్తున్న సమాచారాన్ని ఇంకా అదనంగా పథకాలు ఇవ్వడానికి ఉపయోగిస్తామన్నారు. ఇది రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదని తెలిపారు. దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందన్నారు. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. కేబినెట్​ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించిన తర్వాత సర్వే చేస్తున్నాం. ఎన్యూమరేటర్లపై దూషణలకు దిగితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తేల్చి చెప్పారు.

"అప్పులు పంచుకుంటున్నారు - ఆస్తులు లేవంటున్నారు"

తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే జరగ్గా, జీహెచ్​ఎంసీ పరిధిలో 4.50 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలో 85 వేలకు పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రినే స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.

'మీ బ్యాంక్​ అకౌంట్​ డీటైల్స్​ అడగడం లేదు. ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నారు. బ్యాంక్​ ఖాతాకు ఆప్షన్​ అడుగుతున్నాం. ఆధార్​ కార్డు తప్పనిసరి కాదు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. గతంలో సర్వే చేయాలని అనేక దీక్షలు, ధర్నాలు చేసిన వారు సైలెంట్​గా ఉన్నారు. అందరూ సర్వేను స్వాగతిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరూ లేరు. ఐడెంటీ కార్డు ఉంటుంది. వాళ్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారు. సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయి. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.' -మంత్రి పొన్నం ప్రభాకర్

'సమగ్ర కుటుంబ సర్వే' - వారికి ఆ సమాచారం ఇస్తే డేంజర్​లో పడ్డట్టే!

ABOUT THE AUTHOR

...view details