తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ - కమలానికే ఎక్కువ ఛాన్స్ - Telangana LokSabha Exit Poll Result

Telangana Lok Sabha Exit Polls LIVE : తెలంగాణ సార్వత్రిక ఫలితాల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయ దుందుభి మోగించబోతోందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. మరోవైపు అధికార కాంగ్రెస్‌ కూడా ఇదే స్థాయిలో స్థానాలు సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్‌ 0-1 సీట్లకు పడిపోనుందని జోస్యం చెప్పాయి. ఎంఐఎం పార్టీకి హైదరాబాద్‌ స్థానం మళ్లీ దక్కుతుందని అన్ని సర్వేలు చెప్పడం గమనార్హం.

Telangana Lok Sabha Elections 2024
Telangana Lok Sabha Exit Polls Results (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 6:35 PM IST

Updated : Jun 1, 2024, 9:50 PM IST

Telangana Lok Sabha Exit Polls Results :గత కొంతకాలంగాప్రతి రాజకీయ పార్టీ, తమ అభ్యర్థుల ఎంపికకు, జనాల నాడీని తెలుసుకోవడానికి సర్వేలపై ఆధారపడుతున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్​ పోల్స్​ల అవశ్యకతపై రాజకీయపార్టీలతో పాటు సామాన్యవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అనేక సర్వేలు, సమీకరణాలు, గతంలో ఎన్నడూ లేనంతగా వీటి ప్రభావం, ప్రమేయం కనిపిస్తోంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీల మధ్య ఈ సర్వేల లొల్లి ఎక్కువగానే కనిపిస్తోంది.

Telangana Lok Sabha Exit Polls (ETV Bharat)

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి కమలం వికసించనుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలో ఈసారి అనూహ్యంగా ఓటర్లు బీజేపీ వైపు మెుగ్గుచూపారని వెల్లడించాయి. మెుత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ప్రధాన పోటీ సాగిందని తెలిపింది. అధికార కాంగ్రెస్‌ 7 నుంచి 9 స్థానాల్లో గెలుస్తుందని, పీపుల్స్‌ పల్స్‌ అంచనా వేసింది. బీజేపీ 6 నుంచి 8, బీఆర్‌ఎస్‌, ఎమ్‌ఐఎమ్‌, చెరో స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది.

కమలానికే అధిక సీట్లు : ఇండియా టీవీ పోల్స్‌ ప్రకారం 8 నుంచి పది స్థానాలను బీజేపీ దక్కించుకుంటుందని పేర్కొంది. అదే కాంగ్రెస్‌ 6 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. బీఆర్ఎస్‌, ఎమ్‌ఐఎమ్‌ చెరో స్థానానికి పరిమితమవుతాయని పేర్కొంది. బీజేపీ 9 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని జన్‌కీబాత్‌ అంచనా వేసింది. కాంగ్రెస్‌ 4 నుంచి 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. బీఆర్‌ఎస్‌ ఒక్కస్థానంలో గెలుస్తుందని చెప్పింది.

కమలం 8 నుంచి పది స్థానాల్లో విజయకేతనం ఎగురువేస్తుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ వెల్లడించింది. కాంగ్రెస్‌ 6 నుంచి 8 స్థానాలకు పరిమితమవుతుందని చెప్పింది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్‌ విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌, బీజేపీలు హోరాహోరీగా పోటీ ఉందని ఏబీపీ-సీ ఓటర్‌ అంచనా వేసింది. ఇరు పార్టీలు 7 నుంచి 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీఆర్ఎస్‌కు సున్నాకు పరిమితమవ్వగా, ఇతరులు ఒక్క స్థానంలో విజయం సాధిస్తారని వెల్లడించింది.

Telangana Exit Polls 2024 :మరో సంస్థ న్యూస్‌ 18, రాష్ట్రంలో బీజేపీ 7 నుంచి 10స్థానాల్లో గెలువబోతుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 5 నుంచి 8 సీట్లొస్తాయని, బీఆర్ఎస్‌ 2 నుంచి 5 చోట్ల, ఇతరులు ఒకచోట గెలుస్తారని చెబుతోంది. రాష్ట్రంలో కమలం పార్టీ విజయదుందుభి మోగిస్తుందని "టుడేస్‌ చాణక్య" సర్వే సంస్థ చెబుతోంది. బీజేపీ 10 నుంచి 14 లోక్‌సభ నియోజకకవర్గాల్లో గెలుస్తోందని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ 3 నుంచి 7 చోట్ల గెలువొచ్చని, ఇతరులు ఒక చోట గెలవనుండగా బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటైనా రాకపోవచ్చని టుడేస్‌ చాణక్య సర్వే చెబుతోంది.

ఎగ్జిట్​ పోల్స్​ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్‌ ఎమ్‌ఐఎమ్‌
పీపుల్స్‌ పల్స్‌ 6-8 7-9 0-1 01
ఆరా 8-9 7-8 00 01
ఇండియా టీవీ 8-10 6-8 0-1 1
జన్‌కీబాత్‌ 9-12 4-7 0-1 1
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్‌ 8-10 6-8 0-1 1
ఏబీపీ-సీ ఓటర్‌ 7-9 7-9 00 1
న్యూస్‌-18 7-10 5-8 2-5 1
టుడేస్‌ చాణక్య 10-14 3-7 00 1

ఏపీలో అధికారం 'కూటమి'దే - వెలువడిన ఎగ్జిట్​ పోల్స్ సర్వే - Andhra Pradesh Exit Poll 2024

'ఎన్​డీఏ కూటమికే ప్రజల మద్దతు! ప్రధానమంత్రిగా మళ్లీ మోదీనే!'- లేటెస్ట్ సర్వే రిపోర్ట్ - Lok Sabha Pre Poll Survey

Last Updated : Jun 1, 2024, 9:50 PM IST

ABOUT THE AUTHOR

...view details