తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ - Telangana HC on Operation Chabutra - TELANGANA HC ON OPERATION CHABUTRA

Chabutra Mission Program in Telangana : మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. ఈ రెండు పేర్లతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త మసూద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు వివరణ ఇచ్చింది.

Chabutra Mission Program in Telangana
Chabutra Mission Program in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 10:41 PM IST

Telangana High Court on Operation Chabutra : మిషన్​ చబుత్ర, ఆపరేషన్​ రోమియో వంటి పేర్లతో పోలీసులు నిర్వహిస్తున్న సోదాలను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. పోలీసుల నుంచి వివరాలు తెలుసుకోకుండా సోదాలను నిలిపివేయాలంటూ ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది. పోలీసులు నిర్వహిస్తున్న ఈ సోదాలపై వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

మిషన్ చబుత్రా, ఆపరేషన్ రోమియో, మిడ్‌నైట్ కౌన్సెలింగ్ వంటి పేర్లతో చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త మసూద్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

చిన్న చిన్న వ్యాపారులు, వీది వ్యాపారులను రాత్రి 10:30 నుంచి 11 గంటల్లోనే మూసివేయిస్తున్నారని, ఇది 2015లో జారీ చేసిన జీఓకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లను ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటలకు వరకు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించినా పోలీసులు మూసివేయిస్తున్నారన్నారు. అయితే పోలీసులు చట్టవిరుద్ధంగా సోదాలు నిర్వహిస్తూ గుర్తింపు కార్డులు చూపాలంటూ ప్రజలను, ఇళ్లలోని మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.

నాలుగు వారాలు వాయిదా :ఏ చట్టం కింద పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. పేదలు నివసించే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. మిషన్ చబుత్రా, ఆపరేషన్ రోమియో పేర్లతో నిర్వహిస్తున్న సోదాలను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇందులో పిటిషనర్ కూడా బాధితుడేనన్నారు వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

గ్రామ పంచాయతీల విలీనంపై వివరణ ఇవ్వండి : మరోవైపు శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

వారికి చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, దర్యాప్తు కొనసాగించండి - సైబరాబాద్​ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు - high court on hydra

విద్యుత్​ కొనుగోళ్ల వ్యవహారంలో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట - మధ్యంతర ఉత్తర్వులు జారీ - Telangana power purchase Issue

ABOUT THE AUTHOR

...view details