Telangana High Court fire on officials due to Food Poison in Schools :తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించడంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోనే మూడుసార్లు భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలవడమేంటని ప్రశ్నించింది. ఇలా జరుగుతుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా? అని మండిపడింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని వెల్లడించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదంది. అధికారులకు సైతం పిల్లలున్నారు కదా. దీనిని దృష్టిలో పెట్టుకొని మానవత్వంతో వ్యవహరించాలని హైకోర్టు తెలిపింది.
ఆ అధికారి వద్ద ఫోన్ లేదా? : పాఠశాలలో భోజనం వికటించిన విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్న సంబంధిత అధికారిని సంప్రదించడానికి వారం రోజుల వ్యవధి ఎందుకు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ సదరు అధికారి వద్ద ఫోన్ లేదా? ఇంటర్‌నెట్ సౌకర్యం లేదా? అలాగాక ఏమైన మైనస్ 30 డిగ్రీల వాతావరణంలో ఉన్న అధికారిని సంప్రదించడానికి సమయం కావాలా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పిల్లలపట్ల ఈ విధంగానే వ్యవహరిస్తారా? అని మండిపడింది. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని హైకోర్టు వ్యాఖ్యనించింది.
ఫుడ్‌పాయిజన్‌తో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి - 21రోజులు వెంటిలేటర్‌పైనే