Overseas Education Scholarships in Telangana: విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు త్వరలోనే భారీ ఊరట కలగనుంది. తెలంగాణలో ఈ పథకం కింద అందిస్తున్న స్కాలర్‌షిప్స్ సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అందిస్తున్న వాటికి దాదాపు రెండింతలకు పైగా చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వర్గాల్లో ప్రతి సంవత్సరం 1,110 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య ఉపకార వేతనాలు అందుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపితే ఆ సంఖ్య 2,300 చేరే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఏటా స్ప్రింగ్ సీజన్‌కు మార్చిలో, ఫాల్ సీజన్‌కు అక్టోబరులో అప్లికేషన్లను స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. లబ్ధిదారులకు 2 విడతలల్లో (ఏడాదికి రూ.10 లక్షలు) రూ.20 లక్షల స్కాలర్‌షిప్, విమాన ఛార్జీలు, వీసా ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తోంది.
అప్పులు చేసి వీసాలు పొంది:గతంలో స్కాలర్‌షిప్ మంజూరయ్యాక విద్యార్థులు వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు. వివిధ కారణాలతో కొందరి వీసాలు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో వీసాలు పొందిన విద్యార్థులే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఉపకార వేతనం మంజూరు చేస్తుందన్న నమ్మకంతో కొందరు అప్పులు చేసి మరి వీసాలు పొంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు.
ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదం - వాగులో నలుగురు యువకులు గల్లంతు