Telangana Govt Provide Electric Autos to Womens:ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది. ఓ వైపు కాలుష్యాన్ని నియంత్రించే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని అనుకుంటోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ ఆటోల్ని కొని డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకంపై దృష్టి సారించింది. మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పే ఓ సంస్థ ఆ శాఖ అధికారుల్ని ఇటీవల కలిసింది. కాగా ఆటో కొనుగోలుకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని భరించే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణ:సాధారణంగా ఆటో నడపడం కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు తక్కువగా కనిపిస్తుంటారు. కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతోంది. జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ఒకటి ఉంది. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోల్ని నడపడం చాలా సులభం. దీంతో ఆ కంపెనీ, సోదరసంస్థ కలిసి ఇప్పటికే కొంతమంది మహిళలకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇస్తోంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నవారికి జీతం ఇచ్చి నడిపిస్తోంది. మరి కొంతమందికి అద్దె పద్ధతిలోనూ ఇస్తోంది. కుటుంబ అవసరాల కోసం ఉపాధిని వెతుక్కుంటున్న మహిళలు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ దాష్టీకం - అయ్యప్ప భక్తుల బ్యాగులు పడేసి ఉడాయించిన వైనం