ETV Bharat / state

ప్రమాదాల నివారణకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ - ఇకపై ప్రతి వాహనానికీ జీపీఎస్ - VEHICLE LOCATION TRACKING DEVICES

రాష్ట్రంలో వాహన ప్రమాదాల కట్టడికి సరికొత్త వ్యవస్థను ఏర్పాటు - కొత్త వ్యవస్థ అమలుపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం

GPS_VLTD_Devices_on_Vehicles_in_AP
GPS_VLTD_Devices_on_Vehicles_in_AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

GPS VLTD Devices on Vehicles: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగంతో వెళ్తూ అదుపు తప్పి జరుగుతున్న ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా అంతకు మించి క్షతగాత్రులవుతున్నారు. అదే సమయంలో ప్రజా రవాణా వాహనాల్లో మహిళ ప్రయాణికుల భద్రత సైతం సవాల్​గా మారింది. వీటికి చెక్ పెట్టేందుకు వీఎల్​టీడీ (Vehicle Location Tracking Device) పేరిట సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జీపీఎస్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే వీఎల్​టీడీ పరికరాన్ని ప్రతి వాహనంలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటితో పాటు వాహనాల్లో పానిక్ బటన్​ను ఏర్పాటు చేయనుంది.

దీని ద్వారా వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా నివారించడం సహా, ఆపత్కాలంలో ఆదుకోవడం, సహా భద్రత పటిష్టపరచాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టును చేపట్టడంపై సమగ్రంగా అధ్యయనం చేసిన రవాణాశాఖ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ప్రాజెక్టు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు, అమలు చేయాల్సిన విధానంను వివరిస్తూ ప్రభుత్వానికి పలు కీలక సిఫార్సులు చేసింది. వీలైనంత త్వరగా అమలు చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

వీఎల్​టీడీ ప్రాజెక్టు అమల్లో భాగంగా రవాణా వాహనాలు, రవాణేతర వాహనాల్లోనూ ప్రతి వాహనంలో వీఎల్​టీడీని, దీనికి అనుసంధానంగా పానిక్ బటన్​ను ఏర్పాటు చేస్తారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో రాజధానిలో ఓ ప్రధాన కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాల డివైస్​లను దీనితో అనుసంధానిస్తారు. జిల్లా కేంద్రాల్లోనూ ఆర్టీఎ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి వాహనాల కదలికలను ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తారు. జీపీఎస్ పరికరం కలిగిన వాహనం ఏ సమయానికి, ఎక్కడుందో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత వేగంతో వెళ్తుందో ఖచ్చిత సమయాన్ని క్షణాల్లో తెలుసుకునేలా అధునాతన టెక్నాలజీ ని పొందుపరుస్తారు.

ఏజెన్సీలో సుందర మనోహర దృశ్యాలు - ఏ మూల చూసినా అద్భుతమే

క్షణాల్లో కేంద్ర కంట్రోల్ రూంకి సమాచారం: ఏదేని వాహనంలో ప్రయాణికులు ఆపదలో ఉన్నట్లయితే వాహనంలో ఉన్న పానిక్ బటన్​ను నొక్కితే చాలు క్షణాల్లో సమాచారం కేంద్ర కంట్రోల్ రూంకు చేరుతుంది. అక్కడ ఉన్న సిబ్బంది క్షణాల్లో గుర్తించి వాహనాలన్ని ట్రాక్ చేస్తారు. వాహనం ఎక్కడుంది ఎటు వైపు వెళ్తుందనే విషయాన్ని తెలుసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్​ను అప్రమత్తం చేస్తారు. తద్వారా క్షణాల్లో భద్రతా సిబ్బంది వాహనాన్ని వెంబడించి అవసరమైన సహాయం అందిస్తారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికుల భద్రత కోసం రవాణా వాహానాల్లో వీఎల్​టీడీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను 2019లోనే ఆదేశించింది.

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తోన్న రవాణా వాహనాలన్నీ ఇదే తరహా వ్యవస్థ ఏర్పాటుతోనే రోడ్డెక్కుతున్నాయి. వీటి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దశలవారీగా అన్ని పాత వాహనాలకూ వీఎల్​టీడీ పరికరాలు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినా గత వైఎస్సార్సీపీ సర్కారు పెడచెవిన పెట్టింది. పొరుగున ఉన్న బెంగుళూరులో ఎమర్జెన్సీ పానిక్ బటన్ల ద్వారా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను ట్రాక్ చేయడానికి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కర్ణాటక రవాణా మంత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా 'ముప్పాళ్ల' - రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

వాహనాల వేగాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు: రవాణా శాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.79 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. వీటిలో సరకు రవాణా వాహనాలు 21 లక్షలు ఉండగా 1.58 లక్షల వాహనాలు ప్రయాణికులను చేరవేసేందుకు వినియోగించేవి ఉన్నాయి. వాహనదారులు రోడ్డు భధ్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నా అత్యధిక వాహనదారులు బేఖాతరు చేస్తున్నారని పరిమితికి మించి అతి వేగంతో వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రమాదాల బారిన పడినపుడు వాహనాలు ఎంత స్పీడ్​తో ప్రయాణించిందనే ఖచ్చిత వివరాలు ప్రస్తుతం తెలుసుకునే అవకాశం లేదు. వీఎల్​టీడీ వ్యవస్థతో వాహనాల వేగాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు.

నగరాల్లోని కీలక కూడళ్లు సహా పలు ముఖ్యమైన రహదారులపై ట్రాఫిక్ పరిస్ధితిని ఎప్పటిక ప్పడుు తెలుసుకుని అందుకు అనుగుణంగా నివారణ చర్యలు తీసుకోవచ్చు. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల భద్రత పెరుగుతుండగా ఆపదలో, ప్రమాదాల బారిన పడినపుడు పానిక్ బటన్ నొక్కితే వెంటనే వాహనదారులను ఆదుకోవడం సహా వైద్య సహాయం అందించే అవకాశాలుంటాయి. ఈ విధానాన్ని వీలైనంత త్వరలో అమల్లోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది.

అతి తక్కువ ధరల్లో : మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్రంలో తిరిగే అన్ని ఆటోల్లో అభయం పేరిట జీపీఎస్ ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆపత్కాలంలో పానిక్ బటన్ నొక్కితే ఆదుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఆటోలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఉచితంగా పరికరాలను ఏర్పాటు చేస్తోంది. వీఎల్​టీడీ ప్రాజెక్టులో వాహనదారులే జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని అతి తక్కువ ధరలో వాహనదారులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు తయారీ దారులతో చర్చలు జరుపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండే ఈ వ్యవస్థపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించిన అనంతరం వారి సమ్మతితో ప్రాజెక్టును సమర్థంగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుడుగు వేస్తోంది.

ఈ నెల 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాహన్ వెబ్ సైట్​లో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా దృవపత్రాలు జారీ చేస్తున్నారు. వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్​లను వాహన్ వెబ్ సైట్లో తప్పక నమోదు చేసుకోవాల్సి ఉన్నందున ఇకపై అన్ని ఆర్టీఎ కార్యాలయాల్లో వీటి నమోదుకు ఇబ్బందులు ఉండవు. ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

కొట్టింది వాస్తవమే - ఏ సందర్భంలో జరిగిందో ఆలోచించాలి: మోహన్​బాబు

అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు - 8వేల కోట్ల నిధులకు ఏడీబీ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.