Gruha Jyothi Scheme in Rangareddy District: రంగారెడ్డి జోన్ పరిధిలో అర్హులైన విద్యుత్తు వినియోగదారులకు ఈ నెల నుంచే గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే 6వ తేదీ నుంచి బిల్లులు జారీ చేయాలని డిస్కం నిర్ణయించింది. 200 యూనిట్ల లోపు వినియోగదారులకు సున్నా బిల్లు జారీ చేయనున్నారు. మిగతా వినియోగదారులకు ఈ నెల 1వ తేదీ నుంచే బిల్లింగ్ ప్రక్రియ మొదలైనందున, గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి కోడ్ ముగియగానే సున్నా బిల్లులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Zero Current Bill in Rangareddy :రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా రంగారెడ్డి జోన్ పరిధిలోకి వచ్చే సైబరాబాద్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ సర్కిళ్లలో గృహజ్యోతి పథకం అమలు కాలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఆహారభద్రత కార్డు కలిగిన అర్హులు 4 లక్షల పైనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజాపాలన దరఖాస్తుల్లో 12 లక్షల మంది ఆహారభద్రత కార్డు కలిగిన వారున్నారు. వీరందరికి సున్నా బిల్లులు జారీ కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో చాలా మందికి అందలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోగా కోడ్ రావడంతో వారికి ఈ పథకం ఫలితం పొందలేకపోయారు. వీరందరికీ ఈ నెల 6వ తేదీ నుంచి సున్నా బిల్లులు జారీ కానున్నాయి.