తెలంగాణ

telangana

ETV Bharat / state

డిసెంబరు 8న ఏఐ సిటీకి భూమిపూజ - రాష్ట్రవ్యాప్తంగా 9 రోజులపాటు నిర్వహించే ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ ఇదే - AI CITY BHOOMI POOJA

డిసెంబరు 1 నుంచి 9 వరకూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు - రాష్ట్రవ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించేందకు షెడ్యూల్​ను విడుదల చేసిన ప్రభుత్వం

Prajapalana Vijayotsavam Celebrations
AI CITY BHOOMI POOJA IN HYDERABAD (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2024, 10:25 AM IST

Prajapalana Vijayotsavam Celebrations For Nine Days in Telangana :రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ సిటీ డిసెంబర్​ 8న భూమి పూజ జరగనుంది. అక్కడ దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీస్​ స్పేస్​ (విశాలమైన కార్యాలయాన్ని) నిర్మించడానికి ఇప్పటికే ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్‌ (వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌-డబ్ల్యూటీసీఏ)ముందుకొచ్చింది. భవిష్యత్‌లో తెలంగాణ ఏఐ సిటీ ప్రపంచానికే ప్రతీకగా నిలుస్తుందని, ఏఐ ఆవిష్కకర్తలకు నిలయంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ద్విగుణీకృతమవ్వడంలో ఏఐ సిటీ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మున్ముందు కొన్ని వందల కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది తొలి అడుగుగా అభిప్రాయపడుతోంది. ఏఐ సిటీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలటిక్స్‌ల్లో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’లు కూడా రానున్నాయి. శిక్షణ సౌకర్యాలు, వాణిజ్య సేవలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు, ప్రపంచస్థాయి క్యాంపస్‌లు, లగ్జరీ హోటళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నివాస గృహాలు వంటివి కూడా ఇందులో ఉండేలా ఏఐ సిటీకి రూపకల్పన చేశారు.

కార్యక్రమాల షెడ్యూల్ విడుదల :కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావస్తున్నందున ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాలు భాగంగా ఏఐ సిటీకి భూమి పూజ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్​ను విడుదల చేసింది.

డిసెంబరు 1 : విద్యాశాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ పాఠశాలల రెండో దశకు శంకుస్థాపన చేస్తారు. సీఎం కప్​ 2024 పోటీలను ప్రారంభిస్తారు. ఈ పోటీలు డిసెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి.

డిసెంబరు 2 : 16 నర్సింగ్​, 28 పారా మెడికల్​ కాలేజీలను ప్రారంభిస్తారు. అలాగే 213 కొత్త అంబులెన్స్​లను ప్రారంభించనుండా 33 ట్రాన్స్​జెండర్​ క్లినిక్​లను ప్రారంభిస్తారు. ట్రాఫిక్​ వాలంటీర్లుగా ట్రాన్స్​జెండర్ల పైలట్​ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

డిసెంబరు 3 :హైదరాబాద్​ రైజింగ్​ కార్యక్రమంతో పాటు ఆరాంఘర్​-జూపార్క్​ ఫ్లైఓవర్​ను ప్రారంభిస్తారు. రూ.150 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించనున్నారు.

డిసెంబరు 4 : వర్చువల్​ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభించనున్నారు. తెలంగాణ ఫారెస్ట్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సుమారు 9007 మందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం చేయనున్నారు.(అటవీ శాఖ కార్యక్రమాలు)

డిసెంబరు 5న మహిళాభివృద్ధి కార్యక్రమాలు

  • స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు
  • ఇందిరా మహిళా శక్తి బజార్‌ ప్రారంభం
  • మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభోత్సవం
  • ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం

డిసెంబరు 6న విద్యుత్‌ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు

  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం
  • 244 విద్యుత్‌ ఉపకేంద్రాల శంకుస్థాపన

డిసెంబరు 7న విపత్తు నివారణ

  • స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ప్రారంభం
  • మూడురోజుల పాటు తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
  • పోలీస్‌ బ్యాండ్‌ ప్రదర్శన

డిసెంబరు 8న స్పోర్ట్స్‌ వర్సిటీ

  • డిసెంబరు 8వ తేదీన 7 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుల ప్రారంభం
  • ఏఐ సిటీకి భూమి పూజ
  • 130 కొత్త మీ సేవల ప్రారంభం
  • యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన

డిసెంబరు 9 : లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ట్యాంక్​బండ్​ మీద ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం డ్రోన్​ షో, ఫైర్​ వర్క్స్, ఆర్ట్​ గ్యాలరీ, వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

తొలి ఏడాదే రైతుల కోసం రూ.54,280 కోట్ల ఖర్చు - నివేదిక విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు - ఉద్యమ అమరవీరులకు నివాళి - PRAJA PALANA DINOTSAVAM 2024

ABOUT THE AUTHOR

...view details