తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే ధరణి స్థానంలో భూ భారతి - ఇకనైనా సమస్యలు పరిష్కారమయ్యేనా? - BHU BHARATI IN PLACE OF DHARANI

Dharani Portal Name Change in Telangana : ధరణి పోర్టల్‌ స్థానంలో కొత్తగా భూ భారతిని తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సమగ్ర చట్టంతో పాటు అత్యాధునిక సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జూన్‌ 6వ తేదీ తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపనుంది.

TS GOVT Discuss on Dharani Portal
Dharani Portal New Name (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 12:45 PM IST

Updated : May 28, 2024, 12:51 PM IST

Dharani Portal Name Change in Telangana : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన భూ భారతిని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోదండ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ, భూచట్టాలపై పట్టున్న నిపుణులతో కమిటీని వేసింది. ఆ కమిటీ ఇప్పటికే అనేక మార్లు సమావేశమై ధరణి సాప్ట్‌వేర్‌ సమస్యలతో పాటు పాలనాపరమైన సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించింది.

Dharani Portal Issue in Telangana: భూలావాదేవీలతో సంబంధం కలిగిన రెవెన్యూ, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌బోర్డ్‌, భూదాన్‌ బోర్డు తదితర విభాగాలతో సమావేశమై కమిటీ సభ్యులు చర్చించారు. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలను తీసుకున్న కమిటీ సభ్యులు భూ చట్టాలపై అవగాహన కలిగిన కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ధరణి పోర్టల్​ను పూర్తి స్థాయిలో మార్పులు చేసి దాని స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన మరో కొత్త సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అంచనా వేశారు. దీంతో కొన్నేళ్లుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు చెందిన భూసమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.

Special Drive on Dharani Portal Issue : పెండింగ్‌లో ఉన్న 2.43 లక్షలు భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. కొన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అయినప్పటికీ మరికొన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో, సీసీఎల్‌ఎ స్థాయిలో పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్‌లో వచ్చిన వినతులపై మరింత సమగ్ర దర్యాప్తు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని సరిచూసుకున్న తర్వాతే సమస్య పరిష్కారంపై ఒక నిర్ణయానికి రావల్సినవి కూడా ఉన్నాయి. ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ధరణి సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడింది.

ధరణి స్పెషల్ డ్రైవ్​ను ఈ నెల 17 వరకు పొడిగించిన సర్కార్

Dharani Committee Discuss on Land Issues : జూన్‌ 6తో పార్లమెంటు ఎన్నికల నియమావళి ముగియనుంది. ఆ తర్వాతే ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్షణమే పెండింగ్​లో ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. ఇదే సమయంలో ధరణి పోర్టల్‌, చట్టం స్థానంలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ధరణి కమిటీ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న భూమి ప్రాజెక్టుతో పాటు, గుజరాత్‌, ఒడిశా, బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలల్లో జరిగిన సర్వేలను పరిశీలన చేస్తారు.

New Web Portal on Land Issues in Telangana : ఉత్తరప్రదేశ్‌లో అమలవుతున్న భూములకు సంబంధించిన సింగిల్‌ లాను కూడా పరిశీలిన చేయాలని ధరణి కమిటీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలల్లో పర్యటించి అక్కడ అమలవుతున్నచట్టాలను, ఆర్వోర్‌లను, సాప్ట్‌వేర్‌లను క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఏయే రాష్ట్రాల్లో ఏయే అంశాలు ప్రామాణికంగా ఉన్నాయో వాటిని క్రోడీకరించి అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన చట్టంతో పాటు సాప్ట్‌వేర్‌, ఆర్వోర్‌లను తీసుకొచ్చేందుకు మరింత సమయం పడుతుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌ మొదటి వారంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు సీఎంతో సమావేశమైన తర్వాత కమిటీ సభ్యులు తదుపరి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

కుట్రపూరితంగానే 'ధరణి' రూపకల్పన చేశారు - భూ కుంభకోణాలకు కేసీఆర్​, కేటీఆర్​లే కారకులు : కోదండరెడ్డి - Kodanda Reddy on Dharani portal

Last Updated : May 28, 2024, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details