తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ​కో సంస్థ నుంచి బీఆర్​ఎస్​కు​ రూ.కోట్ల కొద్ది డబ్బులు : కీలక విషయాలు వెల్లడించిన ప్రభుత్వం - TELANGANA GOVT ON FORMULA E RACE

ఫార్ములా - ఈ కార్‌ రేసింగ్ కేసులో ప్రభుత్వం కీలక అంశాలు - ఎన్నికల బాండ్ల ద్వారా గ్రీన్ కో, దాని అనుబంద‌ సంస్థలు బీఆర్ఎస్‌కు రూ.41 కోట్లు చెల్లించినట్టు వెల్లడి

Telangana Govt on Formula E Race
Telangana Govt on Formula E Race (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 1:46 PM IST

Telangana Govt on Formula E Race :ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీల‌క అంశాల‌ను బ‌య‌ట పెట్టింది. గ్రీన్ కో, దాని అనుబంద‌ సంస్థలు 26 సార్లు రూ.41 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన‌ట్లు వెల్లడించింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచార‌ణ‌కు పిలిచిన స‌మ‌యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక‌ల బాండ్ల వివ‌రాల‌ను బ‌య‌ట పెట్టింది. ఎన్నిక‌ల బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీ రూ.41 కోట్లు ల‌బ్ది పొందినట్లు కీల‌క‌ వివ‌రాల‌ను వెల్లడించింది.

కేటీఆర్​ వస్తాడా? రాడా? - ACB విచారణపై తీవ్ర సందిగ్దత

హైద‌రాబాద్‌లో 2023 సంవ‌త్సరంలో కార్ రేస్‌ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ 2022 ఏప్రిల్‌, అక్టోబ‌ర్ నెల‌ల్లో 26 సార్లు రూ.కోటి, అంత‌కంటే ఎక్కువ విలువ చేసే ఎన్నిక‌ల బాండ్లను కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ల‌బ్ధి చేకూర్చిన‌ట్లు ప్రభుత్వం వివ‌రాల‌ను బ‌య‌టపెట్టింది. 2022 ఏప్రిల్ 8న 20 ఎన్నిక‌ల బాండ్లు, అక్టోబర్‌లో మ‌రో ఆరు ఎన్నిక‌ల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఎన్నిక‌ల బాండ్ల ద్వారా మొత్తం రూ.41 కోట్లు బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో చెల్లించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నెల 6న విచారణకు రండి : కేటీఆర్‌కు ACB నోటీసులు

ABOUT THE AUTHOR

...view details