New Pensions in Telangana: తెలంగాణలో పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 4వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగా.. తాజాగా దీనిపై బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. మంత్రి ప్రకటనతో కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి, పాత లబ్ధిదారులకు ఇది శుభవార్తే అని చెప్పొచ్చు. ఇంతకీ మంత్రి ఏమని ప్రకటన చేశారో ఇప్పుడు చూద్దాం..
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే.. ఇప్పటికే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిశాక మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పగా.. ఈ క్రమంలోనే.. కొత్త పింఛన్ అమలు, నూతన రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
ఏం ప్రకటన చేశారంటే..అతి త్వరలోనే కొత్త పింఛన్ అంటే సాధారణ పింఛను రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు, అలాగే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి కూడా ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - ఆ రోజు నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ - మంత్రి కీలక ప్రకటన! - New Ration Cards Update
కొత్త పింఛను కోసం భారీగా దరఖాస్తులు:రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు గానూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా.. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా కొత్త పింఛన్ల కోసం 24.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు వెరిఫై చేసి ఇప్పుడున్న లబ్ధిదారులతో వారితో పాటు కొత్తవారికి కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే ఇస్తామని అన్నారు.
కొత్త రేషన్ కార్డులపై కూడా ప్రకటన: నూతన రేషన్ కార్డుల కోసం కూడా ఎదురుచూస్తున్న వారికి మంత్రి పొన్నం గుడ్న్యూస్ చెప్పారు. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే.. సీఎం రేవంత్రెడ్డి కూడా కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ - సర్కార్ తాజా నిర్ణయంతో వారికి మరింత లబ్ధి! - Good News to Ration Card Holders
మీరు రేషన్ ఈ-కేవైసీ నమోదు చేసుకున్నారా? - త్వరపడండి ఇదే లాస్ట్ ఛాన్స్ - Ration Card E KYC