IAS Officers Transfers in TG 2024 : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలికంగా బదిలీ ప్రక్రియ చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు అధికారులను మార్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికలు ముగిసినందున పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా భారీ ఎత్తున ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది.
బదిలీ అయిన కలెక్టర్లు వీరే :
- ఖమ్మం కలెక్టర్- ముజామిల్ ఖాన్
- నాగర్‌కర్నూల్ కలెక్టర్- సంతోష్
- భూపాలపల్లి కలెక్టర్- రాహుల్‌శర్మ
- కరీంనగర్ కలెక్టర్- అనురాగ్ జయంతి
- పెద్దపల్లి కలెక్టర్- కోయ శ్రీహర్
- జగిత్యాల కలెక్టర్- సత్యప్రసాద్
- మంచిర్యాల కలెక్టర్- కుమార్ దీపక్
- మహబూబ్‌నగర్ కలెక్టర్- విజయేంద్ర
- హనుమకొండ కలెక్టర్- ప్రావీణ్య
- నారాయణపేట కలెక్టర్- సిక్తా పట్నాయక్
- సిరిసిల్ల కలెక్టర్- సందీప్‌కుమార్ ఝా
- కామారెడ్డి కలెక్టర్- ఆశిష్ సంగ్వాన్
- భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్- జితేష్ వి పాటిల్
- వికారాబాద్ కలెక్టర్- ప్రతీక్ జైన్
- నల్గొండ కలెక్టర్- నారాయణరెడ్డి
- వనపర్తి కలెక్టర్- ఆదర్శ్ సురభి
- సూర్యాపేట కలెక్టర్- తేజస్ నందలాల్ పవార్
- వరంగల్ కలెక్టర్- సత్య శారదాదేవి
- ములుగు కలెక్టర్- దివాకరా
- నిర్మల్ కలెక్టర్- అభిలాష అభినవ్