Telangana Govt Offer to Indian Cricketer Siraj : టీ20 ప్రపంచకప్ 2024 విజేత జట్టులోని హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. క్రికెటర్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ సిరాజ్ కలిశారు. అనంతరం హైదరాబాదీ క్రికెటర్‌ను సీఎం అభినందించారు.
అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్‌కు టీమిండియా జెర్సీని బహుకరించారు. టీ20 ప్రపంచకప్ 2024 సాధించినందుకు సిరాజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆ తర్వాత శాలువతో హైదరాబాదీ క్రికెటర్‌కు సత్కరించారు.
కాసేపు టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం, ఫైనల్లో విజయం, సభ్యుడిగా ఎలా సంబరాలు చేసుకున్నారు, విజయం సాధించినప్పుడు టీమిండియా ప్లేయర్లు భావోద్వేగాలను సీఎం రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఇలా కాసేపు ఇరువురు ముచ్చటించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ సహా పలువురు ఉన్నారు.