ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 4:31 PM IST

ETV Bharat / state

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ - ఖాళీల వివరాలు ఇవే

Telangana DSC Notification 2024 : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్​ను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి విడుదల చేశారు. పరీక్షల తేదీ ప్రకటించనప్పటికీ మార్చి 4 నుంచి ఏప్రిల్​ 2 వరకు అభ్యర్థులు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

telangana_dsc_notification_2024
telangana_dsc_notification_2024

Telangana DSC Notification 2024:తెలంగాణ రాష్ట్రంలో కొలువుల నగారా మోగింది. ఉద్యోగాల కల్పనకు పెద్ద పీఠ వేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కారు ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. పేపర్ లీకేజీ సహా పలు కారణాలతో గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి అదనపు పోస్టులను కలిపి ఇటీవల 563 పోస్టులతో సర్కారు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notification 2024)​ను సీఎం రేవంత్​ రెడ్డి విడుదల చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య, విద్యాశాఖఅధికారులు పాల్గొన్నారు.

నోటిఫికేషన్​ వివరాల్లోకి వెళితే మార్చి 4 నుంచి ఏప్రిల్​ 2 వరకు అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్​లో విద్యాశాఖ పేర్కొంది. దరఖాస్తు రుసుము రూ.1000లుగా నిర్ణయించింది. 5,089 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేసిన విద్యాశాఖ, తాజాగా అదనపు పోస్టులను జత చేస్తూ 11,062 ఉద్యోగాల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అఫ్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2023 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి 46 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులని పేర్కొంది. మెగా డీఎస్సీ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఆన్​లైన్​ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల - 6100 పోస్టులు, 12 నుంచి దరఖాస్తులు

TS Mega DSC Notification 2024 :మెగా డీఎస్సీ ద్వారా సర్కారు మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 కాగా, 727 భాషా పండితులు, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 పోస్టులను భర్తీ చేయనుంది. జులై 1వ తేదీ 2023నాటికి 18 ఏళ్లు పూర్తి అయి 46 ఏళ్లు లోపు ఉన్నవారు డీఎస్సీ రాసేందుకు అర్హులని నోటిఫికేషన్​లో పేర్కొంది. అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది.

DSC 2024 Notification in Telangana :గతంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ(DSC) నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. అందుకు అనుగునంగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రతి బడికి ఉపాధ్యాయుడు ఉండాలనే సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ గత మూడు వారాలుగా కసరత్తు చేసి నోటిఫికేషన్​ను సిద్ధం చేసింది. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్​కు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు.

గందరగోళం ఎక్కువ-సమయం తక్కువ! ఏపీ సర్కార్ జారీ చేసిన టెట్‌ నోటిఫికేషన్‌పై అభ్యర్థుల్లో ఆందోళన!

అసెంబ్లీ ఎన్నికలతో అది జరగలేదు. ప్రభుత్వం మారినందున మరిన్ని పోస్టులను కలిపి పాత నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్తది విడుదల చేసింది. నాటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌ తయారు చేశారు. పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించేలా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పరీక్షను ఎంసెట్‌ తరహాలో నిర్వహించనున్నారని తెలుస్తోంది.

హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details