Second Phase of Farmer Crop Loan Waiver in Telangana :రెండో విడత రుణమాఫీలోలక్షన్నర రూపాయల వరకు రుణాలమాఫీని మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో విడతలో సుమారు 7 లక్షల మంది రైతులకు దాదాపు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తోంది. మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది.
ఈ నెల 19న మొదటి విడత ప్రారంభించింది. మొదటి విడతలో సుమారు 10.83 లక్షల కుటుంబాలకు చెందిన పదకొండున్నర లక్షల ఖాతాల్లో రూ.6 వేల కోట్లు జమ చేసింది. ఆధార్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో సుమారు 17 వేల మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదు. మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎట్టకేలకు రైతన్నకు విముక్తి - నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా రుణమాఫీ - మల్కాజిగిరిలో కేవలం ఒక్కరికే - Crop Loan Waiver in Telangana
మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ : లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల్లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఓ సభలో తెలిపారు. హరీశ్ రావు ఆగస్టులోపు రుణమాఫీ చేయాలన్న సవాల్‌ను స్వీకరించి మాఫీ చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ.6,093 కోట్లను జమ చేశామన్నారు. రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో రూ.31 వేల కోట్లును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. కేవలం పాస్‌బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రుణమాఫీ డబ్బులపై సైబర్‌గాళ్ల కన్ను : రుణమాఫీపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అయితే రుణమాఫీ డబ్బులను కొట్టేసేందుకు సైబర్ కేటుగాళ్లు పన్నాగం పన్నుతున్నారు. దీంతో సైబర్ పోలీసులు రైతులు ఎవరూ వారి ఫోన్లకు వచ్చిన సందేశాలపై క్లిక్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే మీ రైతు రుణమాఫీ డబ్బులను కేటుగాళ్లు కొట్టేసే అవకాశం ఉందని, అపరిచిత వ్యక్తులకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వవద్దని హెచ్చరించారు.
ఎదురుచూపులకు పుల్‌స్టాప్ - రైతు రుణమాఫీని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ - FARMER LOAN WAIVER FUNDS CREDITED