CM Revanth Reddy Will Release DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు. మొదటగా జనరల్ ర్యాంక్ లిస్ట్‌ను ఆయన విడుదల చేశారు. మార్చి 1న 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. రిజల్ట్స్ కోసంhttps://tgdsc.aptonline.in/tgdsc/ ఇక్కడక్లిక్ చేయండి.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల - ఈ నెల 9న నియామక పత్రాల అందజేత - DSC Results 2024
CM Revanth Reddy Will Release DSC Results 2024 : అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2024, 12:48 PM IST
డీఎస్సీ ఫలితాలు కేవలం 55 రోజుల్లోనే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఒకే డీఎస్సీ ఇచ్చిందని అది కూడా 7వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తుచేశారు. టీఎస్‌పీఎస్సీనీ ప్రక్షాళన చేశామని తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తామని స్పష్టం చేశారు.