తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ - స్వాగతం పలికిన ఈవో ధర్మారెడ్డి - CM Revanth Reddy Tirumala Visit - CM REVANTH REDDY TIRUMALA VISIT

CM Revanth Visit Tirumala Today : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి సన్నిథిలో మనవడి మొక్క తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరుమల చేరుకున్నారు. ముందుగా హైదరాబాద్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. రచనా అతిథి గృహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి తిరుమలలో ఆయన బస చేసి బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు.

Revanth Reddy Visit Tirumala Today
CM Revanth Reddy Tirumala Visit (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 21, 2024, 10:03 PM IST

Updated : May 21, 2024, 10:24 PM IST

CM Revanth Reddy Tirumala Visit : శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్​లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కాగా ఇవాళ రాత్రి తిరుమలలో రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. మనవడికి పుట్టు వెంట్రుకల మొక్కుబడిని స్వామివారికి తీర్చనున్నారు.

అనంతరం బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమలకు బయల్దేరడంతో, నేటి ఆయన కార్యక్రమాలన్నీ రద్దయినట్లు రాష్ట్ర సీఎం కార్యాలయం పేర్కొంది. బుధవారం ఉదయం స్వామివారిని దర్శనానంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ - స్వాగతం పలికిన ఈవో ధర్మారెడ్డి (ETV Bharat)
Last Updated : May 21, 2024, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details