ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్​ ఫోకస్ - Revanth Reddy on Bifurcation Issues

TS Cabinet Meeting 2024 : జూన్ 2తో తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున, అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి సారించారు. ఉమ్మడి రాజధాని కాల పరిమితి ముగియనున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. విభజన అంశాలు, వివాదాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఈ మేరకు ఈ నెల 18న జరగనున్న కేబినేట్ సమావేశంలో విభజన అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 11:45 AM IST

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్​ ఫోకస్ (ETV Bharat)

Telangana Cabinet Meeting On May 18th :ఈ నెల 18న భేటీ కానున్న తెలంగాణ మంత్రివర్గం, పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ మధ్య విభజన వివాదాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బుధవారం నాడు సచివాలయంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ–ఏపీ మధ్య అపరిష్కృతంగా అంశాలపై చర్చ :ఆ రాష్ట్రమంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో, రేవంత్‌ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు. జూన్ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కానున్నందున, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

CM Revanth on Bifurcation Issues : ఏకాభిప్రాయంతో విభజన పూర్తైన అంశాలు, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలన్నీ అందులో పొందుపరచాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, విద్యుత్తు సంస్థల బకాయిల వివాదం తేలలేదని వారు చెప్పారు. ఇప్పటి వరకూ తేలని అంశాలు, వివాదాల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నరేవంత్‌ రెడ్డి, తదుపరి కార్యాచరణపై చర్చించారు.

జగన్​ మాటలను ఆయన తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదు: తెలంగాణ సీఎం రేవంత్ - Revanth Reddy Counter To CM Jagan

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీల వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆయన అధికారులను స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని కాల పరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

చంద్రబాబుపై కేసీఆర్​కు అసూయ, ద్వేషం - ఏపీ రాజకీయాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - Revanth Reddy on AP Politics

ABOUT THE AUTHOR

...view details