తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్​ వేళ 38 కేసులు నమోదు - తుది ఓటింగ్​ శాతంపై రేపటికి స్పష్టత : వికాస్​​రాజ్ - CEO Vikas Raj On Lok sabha Polls - CEO VIKAS RAJ ON LOK SABHA POLLS

CEO Vikas Raj On Lok sabha Polls : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని సీఈవో వికాస్​రాజ్​ పేర్కొన్నారు. తుది ఓటింగ్​ శాతం అనే వివరాలను రేపు వెల్లడిస్తామని తెలియజేశారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.

CEO Vikas Raj On Lok sabha Polls
CEO Vikas Raj On Lok sabha Polls (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 7:18 PM IST

Updated : May 13, 2024, 9:52 PM IST

CEO Vikas Raj On Lok sabha Polls :రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించినట్లుగా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్​ వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వికాస్​రాజ్, రాష్ట్రంలో పోలింగ్​ శాతం బాగానే నమోదైందని పేర్కొన్నారు. తుది ఓటింగ్​ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తామని తెలిపారు. ఇవాళ వివిధ కారణాలపై 38 కేసులు నమోదు చేశామని వివరించారు. జీపీఎస్​ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తామన్నారు.

రూ.330 కొట్ల సొత్తు స్వాధీనం :ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి రూ.330 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా వికాస్​రాజ్​ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 వందల కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 స్ట్రాంగ్ రూమ్​లు ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈవీఎంలు తెల్లవారుజాము వరకు స్ట్రాంగ్ రూమ్​లకు చేరతాయని తెలిపారు. కచ్చితమైన పోలింగ్ శాతం రేపు మధ్యాహ్నం వరకు తెలుస్తుందన్నారు. పోలింగ్​పై మంగళవారం స్క్రూటినీ ఉంటుందని, ఎక్కడైనా రీ-పోలింగ్ అవసరమైతే రేపు తెలుస్తుందని వివరించారు.

తెలంగాణ పోల్ డే - ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే - TOLLYWOOD CELEBRATIES VOTES IN TS

Polling Ended Peacefully In Telangana :రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. క్యూలో నిలబడిన వారు పూర్తయ్యే వరకు పొలింగ్ కొనసాగింది. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈవీఎంలను సీజ్​ చేశారు. పోలింగ్​ కేంద్రాల నుంచి ఈవీఎంలను తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఎన్నికలు విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎన్నికల ప్రధానాధికారి వికాస్​రాజ్​ ధన్యవాదాలు తెలియజేశారు.

" లోక్​సభ ఎన్నికలకు మంచి స్పందన వచ్చింది. వాతావరణం కూడా సహకరించింది. ఎక్కడైనా ఈవీఎంలో సమస్య తలెత్తిత్తే వెంటనే మార్చాము. నేషనల్​ గ్రివెన్స్​ పోర్టల్​ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం. ఈ రోజు 38 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈవీఎమ్​లన్నింటిని స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించే ప్రక్రియ జరుగుతోంది" - వికాస్​ రాజ్​, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల్లో యువత, సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల వద్ద సందడి కనిపించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. మావోయిస్టు ప్రాభల్యమున్న ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.

పోలింగ్​ వేళ 38 కేసులు నమోదు - తుది ఓటింగ్​ శాతంపై రేపటికి స్పష్టత : వికాస్​​రాజ్ (ETV Bharat)

రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్, నిర్భయంగా ఓటెయ్యాలని వికాస్​ రాజ్ విజ్ఞప్తి​ - CEO Vikas Raj on Exit polls 2024

ఓటర్లందరూ తప్పనిసరిగా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలి : సీఈవో వికాస్​రాజ్ - CEO Vikas Raj Interview

Last Updated : May 13, 2024, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details