తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణమాఫీ అమల్లో 31 టెక్నికల్ సమస్యలు - మరి పరిష్కారం ఏంటంటే? - CROP LOAN WAIVER TECHNICAL ISSUES

Technical Issues in Telangana Crop Loan Waiver : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వ్యవసాయశాఖ తెలిపింది. ముఖ్యంగా 31 సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ సమస్యల పరిష్కారానికి ఎక్కడ ఫిర్యాదు చేయాలో కూడా వివరించింది.

Technical Issues in Crop Loan Waiver in Telangana
Technical Issues in Crop Loan Waiver in Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 7:39 AM IST

Technical Issues in Crop Loan Waiver in Telangana :రాష్ట్రంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ పథకం అమలులో 31 సాంకేతిక సమస్యలను రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వాటికి కారణాలను తెలియజేస్తూ, పరిష్కారాల్లో కొన్ని ప్రభుత్వ పరిధిలో, మరికొన్ని బ్యాంకుల పరిధిలో ఉన్నట్లు తెలిపారు. రుణమాఫీ కాని రైతులకు 31 సాంకేతిక కారణాల జాబితాను అందించి, అందులో వారికి సంబంధించిన సమస్యను, దానికి పరిష్కారాన్ని తెలియజేయాలని వివరించారు.

కొన్ని సమస్యలు - పరిష్కారాలు

  • ఖాతాదారు ఆధార్‌ నంబర్‌తో యాప్‌లో తనిఖీ చేసినప్పుడు ‘టు బి ప్రాసెస్‌డ్‌’ అని వస్తే మొదటి, రెండో విడతలో రుణమాఫీ కానట్లుగా భావించాలి. మూడో విడతలో మాఫీకి అర్హత ఉందా, లేదా అన్న విషయం తెలుసుకోవాలి.
  • ‘ఇన్‌వ్యాలిడ్‌ ఆధార్‌ నంబర్‌’ అని వస్తే సరైన ఆధార్‌ నంబర్‌ను నమోదు చేసేలా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలి.
  • ‘నో డేటా ఫౌండ్‌’ అని వస్తే రుణమాఫీకి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్న కాలపరిధిలో రుణ ఖాతా లేదని అర్థం.
  • ఆధార్, రుణ ఖాతాల్లో పేరు వేర్వేరుగా ఉంటే ఆధార్‌ నంబర్‌ను అప్‌లోడ్‌ చేసేందుకు బ్యాంకులకు ఇస్తే సరిపోతుంది.
  • కుటుంబ నిర్ధారణ (ఫ్యామిలీ గ్రూపింగ్‌)ను ఆధార్‌ ఆధారంగా బ్యాంకులు చేసే విధంగా చూడాలి.
  • కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయినా, సర్వీస్‌ పెన్షనర్‌ అయినా ప్రభుత్వ జీవో ప్రకారం రుణమాఫీకి అర్హత లేదన్న విషయం తెలుసుకోవాలి.
  • పట్టాదార్‌ పాస్‌బుక్‌ లేదని వస్తే భార్య/భర్త పేరిట మరో ఖాతా ఉందని తెలుసుకోవాలి.
  • రేషన్‌ కార్డు లేకపోతే ఇతర అర్హతల ప్రాతిపదికన మంజూరుకు అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాలి.
  • నగదు రైతు ఖాతాలో జమ కాకుండా తిరిగి వచ్చినా, ఖాతా మూతపడినా అర్హుడైతే మరో ప్రత్యామ్నాయ పొదుపు ఖాతాలో నిధులు జమ చేయాలి.
  • వేర్వేరు వ్యక్తులకు ఒకే ఖాతా గుర్తింపు సంఖ్య (కస్టమర్‌ ఐడీ) ఉంటే బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. రైతు 2021 కంటే ముందు మరణించినా, ఆ భూమి వారసులకు పంచి ఇచ్చినా అర్హులైన వారికి ప్రభుత్వం సాయం అందించాలి.
  • అసలు కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్నా ఒకే కుటుంబంలో వేర్వేరు రైతులు ఉన్నా పాక్షికంగా రుణమాఫీ అయినా బ్యాంకులు తెలుసుకోవాలి.
  • ఓ కుటుంబంలో వేర్వేరు రుణాలు ఉన్నప్పటికీ అందులో ఒక్క సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినా మాఫీ కాదు.
  • ఒక రైతుకు ఒకటికి మించి రుణ ఖాతాలున్నా ఖాతాతో ఆధార్‌ లింక్‌ లేకున్నా ఇలాంటి సమస్యలను బ్యాంకులు పరిశీలించి పరిష్కరించాలి.

ABOUT THE AUTHOR

...view details