Telangana SSC Results 2024 :తెలంగాణలో ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యయి. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫలితాల ప్రకటనకు ముహూర్తం సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను వెల్లడించనున్నారు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. 5,08,385 మంది పరీక్షలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన మూల్యాంకనం గత శనివారం పూర్తయింది.
TS SSC Board Results 2024 :ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు ఫలితాల డీ-కోడింగ్ అనంతరం ఈ నెల 30న ఫలితాలను వెల్లడించనుంది. ఇందుకోసం విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం అనుమతితో ఇవాళ ఇంటర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇక మిగిలింది పదో తరగతి ఫలితాలు మాత్రమే. మరోవైపు ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యాశాఖ మొత్తం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం లోనికి అనుమతించారు.