TDP Neelayapalem Vijay Kumar on TTD :తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో ఏ వివరాలు పెట్టకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే భక్తులకు ఖర్చుల లెక్కలు చెప్పట్లేదన్నారు. కరుణాకర్‌రెడ్డి వచ్చాక వివరాలేవీ వెబ్‌సైట్‌లో కన్పించట్లేదన్న ఆయన బోర్డు సమావేశాల్లో ఏం చర్చించారో, ఆమోదించారో వివరాలు ఉండవని మండిపడ్డారు.
టీటీడీలో నిర్ణయాలన్నీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డే తీసేసుకుంటున్నారని ఆరోపించారు. కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్ అయిన 3 నెలల్లోనే బడ్జెట్‌కు విరుద్ధంగా 13 వందల కోట్ల రూపాయల పనులను ఆమోదించారన్నారు. దీంతోపాటు కరుణాకర్‌రెడ్డి కుమారుడు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఉండటంతో అభివృద్ధి ముసుగులో కుమారుడి గెలుపు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
దుష్టశక్తిని గద్దె దించేందుకే పొత్తులు - కూటమితోనే రామరాజ్యం: పురందేశ్వరి - Daggubati Purandeswari Comments
ఎన్నికల కోడ్ వచ్చేలోపు నిధుల విడుదల కోసం తిరుపతిలో 2, 3 యాత్రికుల సత్రాలను యుద్ధప్రాతిపదికన కూలగొట్టారని తెలిపారు. ఒకేసారి కూలగొట్టేసరికి సత్రాలు చాలక భక్తులు రోడ్డుపైనే పడుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రెండు సత్రాలు కాంట్రాక్ట్‌లో పెడితే కదా రూ.600 కోట్లు వచ్చేదన్న ఆయన రెండేళ్లైనా నిర్మాణాలు కావు కానీ కమీషన్ మాత్రం 10 శాతం వచ్చేసిందని ఆరోపించారు. దేవస్థానం బడ్జెట్‌ను వైసీపీ ఎలక్షన్ బడ్జెట్ మాదిరి మార్చేశారని ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో గత 6 నెలల్లో ఈవో, ఛైర్మన్ నిర్ణయాలపై ఈసీ సమీక్షించాలని కోరారు. ఇంత జరుగుతున్నా ఈవో పదవీకాలం పొడిగించాలని కేంద్రానికి ఎలా ఉత్తరం రాస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్రాసిన లేఖపైనా ఈసీ విచారణ జరిపించాలన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ రెడ్డిలను పక్కన పెట్టి తిరుమల పవిత్రతను కాపాడాలని నీలాయపాలెం విజయ్ కుమార్ కోరారు.
టీటీడీలో అంతా గోప్యత - ఈవో, ఛైర్మన్ నిర్ణయాలపై ఈసీ సమీక్షించాలి: నీలాయపాలెం "టీటీడీ వెబ్‌సైట్‌లో ఏ వివరాలు పెట్టరు, అంతా రహస్యమే. డబ్బులిచ్చే భక్తులకు ఖర్చుల లెక్కలు చెప్పట్లేదు. బోర్డు సమావేశాల్లో ఏం చర్చించారో, ఆమోదించారో వివరాలు ఉండవు. టీటీడీ నిర్ణయాలన్నీ ఈవో ధర్మారెడ్డి, ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డే తీసేసుకుంటున్నారు. కరుణాకర్‌రెడ్డి ఛైర్మన్ అయిన 3 నెలల్లోనే బడ్జెట్‌కు విరుద్ధంగా ఆమోదించారు. బడ్జెట్‌కు విరుద్ధంగా రూ.1300 కోట్ల రూపాయల పనులకు ఆమోదించారు." - నీలాయపాలెం విజయ్, టీడీపీ అధికార ప్రతినిధి
సేవ కాదు - దోచుకోవడమే వైసీపీ నేతల పని: ఆనం వెంకటరమణా రెడ్డి - TDP Anam Comments on MP Vijayasai