ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది - టీడీపీ ఎంపీల హర్షం - TDP MPs Response on Budget

Kinjarapu Ram Mohan Naidu Comments: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పెద్ద పీట వేసి ప్రధాని మోదీ మాట నిలబెట్టుకున్నారని టీడీపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు ఈ బడ్జెట్ ఊతమిస్తోందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇచ్చి రాజధాని పునర్నిర్మాణానికి సాయం ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.

TDP MPs Response on Budget
TDP MPs Response on Budget (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 2:35 PM IST

Kinjarapu Ram Mohan Naidu Comments: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పెద్ద పీట వేయడంపై టీడీపీ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ఏపీ సుమారు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు. టీడీపీ ఎంపీలతో కలిసి దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్‌ పాలనలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా లేకుండా పోయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. అమరావతికి రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే జగన్‌ శ్మశానం చేయాలని చూశారని దుయ్యబట్టారు.

కూటమి ప్రభుత్వం రాగానే అమరావతికి నిధుల ప్రకటన రావడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామనడం చాలా గొప్ప విషయమని, వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రత్యేక నిధులు ఇస్తామన్నారని తెలిపారు. బడ్జెట్‌ ద్వారా ఏపీకి నూతన విశ్వాసాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఐదు కోట్లమంది రాష్ట్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునే బడ్జెట్‌ ఇది అని కేంద్రమంత్రి రామ్మోహన్‌ అన్నారు. అమరావతికి రూ.15వేల కోట్లు ఇవ్వడం హర్షణీయమని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ప్రత్యేక సాయం ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీకి నిర్మలమ్మ వరాలు - అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు - 15 thousand Crores for Amaravati

ABOUT THE AUTHOR

...view details