తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూటమి దూకుడు - టీడీపీ లోక్​సభ అభ్యర్థులు వీరే!

TDP Lok Sabha Candidates in AP 2024 : పార్లమెంట్​ ఎన్నికలకు సంబంధించి ఏపీలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేయనుండగా టీడీపీ 17 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. టీడీపీ నుంచి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

Finalization of TDP Parliamentary Candidates
Finalization of TDP Parliamentary Candidates

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 12:17 PM IST

TDP Lok Sabha Candidates in AP 2024 :త్వరలో ఆంధ్రప్రదేశ్​లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. ఎవరైవరూ ఏయే స్థానాల్లో పోటీ చేయాలో అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా టీడీపీ 17 పార్లమెంట్​ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా జనసేన 2, బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ నుంచి 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

Telugu Desam Party MP Candidates :శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు(బీసీ), విశాఖ నుంచి ఎం. భరత్, అమలాపురం నుంచి గంటి హరీష్, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ లేదా పోలీస్ అధికారి చంద్రశేఖర్ (బీసీ), విజయవాడ నుంచి కేశినేని శివనాథ్ (చిన్ని), గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులు, బాపట్ల నుంచి ఎస్సీ (మాదిగ సామాజిక వర్గం) నేత ఎంఎస్. రాజు కానీ ఉండవల్లి శ్రీదేవి కానీ, అగ్గి రామయ్య లేదా సౌరవు ప్రసాద్ కానీ బరిలో ఉండే అవకాశం ఉంది.

Lok Sabha Polls 2024 :ఒంగోలు నుంచి మాగుంట రాఘవరెడ్డి, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాద్, రాజంపేట నుంచి సుకవాసి సుబ్రహ్మణ్యం, కడప నుంచి రెడ్డిప్పగారి శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు ఒకరిని పోటీలో నిలిపే అవకాశం ఉంది. హిందూపురం నుంచి బీకే పార్థసారధి, అనంతపురం నుంచి ప్రొఫెసర్ రాజేష్, కర్నూలు పార్లమెంట్ స్థానంలో కురుబ సామాజికవర్గానికి చెందిన నాగరాజు లేదా భవానీ శంకర్ లేదా సంజీవ్ కుమార్​లలో ఒకరు, నంధ్యాలలో బైరెడ్డి శబరి అభ్యర్థిత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మరో రెండుమూడు రోజుల్లో అభ్యర్థుల జాబితాను అధినేత చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది.

ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన

TDP Janasena BJP Alliance Election Campaign :రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు విడతల్లో అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించింది. ఆ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుండగా జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపుతోంది. టీడీపీ 144 స్థానాలకు సంబంధించి రెండు విడతల్లో 128 మంది అభ్యర్థులను ప్రకటించింది. జనసేన 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ అధిష్ఠానం ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

మార్పులు చేర్పులతో అధికార పార్టీలో కలవరం :మరోవైపు అధికార వైసీపీపూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేక పోతోంది. వరుసగా అభ్యర్థులను మారుస్తూ గందరగోళం సృష్టిస్తోంది. సిట్టింగ్​ ఎమ్మెల్యేను కాదని కొంత మంది కొత్త వారికి, మరి కొంత మందిని పక్క నియోజకవర్గాలకు మారుస్తోంది. కొంత మంది పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు కొత్తగా నియోజకవర్గానికి వచ్చే నాయకులకు సహకరించేది లేదని స్థానిక నాయకత్వం, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా అధికార పార్టీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ అభ్యర్థులను మారుస్తూనే ఉంది.

కొలిక్కివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటు - సుదీర్ఘ చర్చల అనంతరం ప్రకటన

నాపై ఉన్న కేసుల వివరాలివ్వండి - ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

టీడీపీ-జనసేన విన్నింగ్‌ టీమ్‌ - వైఎస్సార్సీపీ చీటింగ్‌ టీమ్‌ : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details