ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సంస్కారహీనంగా మాట్లాడారు" - అంబటి, కొడాలి నాని, రోజాపై ఫిర్యాదు - TDP COMPLAIN AGAINST YCP LEADERS

చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను దుర్భాషలాడిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు - ముగ్గురిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

TDP Complain Against YCP Leaders in Visakhapatnam
TDP Complain Against YCP Leaders in Visakhapatnam (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 8:15 AM IST

TDP Complain Against YCP Leaders in Visakhapatnam : వైఎస్సార్సీసీ నాయకులు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజాలపై విశాఖ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్​లను గత ఐదేళ్లలో సంస్కారహీనంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో వివరించారు. ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి, జీవీఎంసీ 33 వ వార్డు క్లస్టర్ ఇంఛార్జ్ విల్లూరి తిరుమల దేవి పోలీసులకు ఫిర్యాదు అందించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details