TDP leader Pattabhi Ram key comments:ఉత్తరాంధ్ర వినాశకారి జగన్ రెడ్డికి విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును కమీషన్ల కోసం తెగనమ్మిన ఘనుడు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. నేడు విశాఖ పోర్టును అంపశయ్యపైకి నెట్టి, విద్యుత్ బిల్లుల కోసం వేదిస్తున్న వంచకుడు ఈ జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి గంగవరం పోర్టును అమ్మిన తరువాత పోర్టులో విశాఖ స్టీల్ కు కోకింగ్ కోల్ దిగుమతికి కోసం ఉన్న ప్రత్యేక బెర్త్‌తో పాటుగా, 100 ఎకరాల స్టాక్ యార్డ్ మాయం చేసారని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ దుయ్యబట్టారు. గతంలో ప్రభుత్వ వాటా ఉండి డీవీఎస్ రాజు నడుపుతున్న సమయంలో విశాఖ స్టీల్ కు హ్యండిలింగ్ ఛార్జ్ టన్నుకు 270 ఉంటే జగన్ రెడ్డి పోర్టును అమ్మాక అధికా కాస్త 350 కి పెరిగిందని ఎద్దేవా చేసారు. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు జగన్ రెడ్డి సర్కార్ పట్టించుకోకపోవడంతో పోర్టు స్తంభించిందన్నారు. గంగవరం పోర్టు స్తంభించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 90 శాతానికి పైగా పడిపోయినదని పట్టాభిరామ్ వెల్లడించారు.
ఇంతగా ప్రజల విశ్వాసం కోల్పోయిన తర్వాత మళ్లీ మీరెందుకు జగన్ !: బీజేపీ నేత సత్యకుమార్
గంగవరం పోర్టు మూసి వేతకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఐసీయూలో చేరడానికి కారకుడు ఈ జగన్ రెడ్డి అని విమర్శించారు. కోడి గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బాధ్యత లేదా అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం దేనికి చేయడం లేదని ఆక్షేపించారు. ఉత్తరాంధ్రలో ఇంతటి విధ్వంసం చేసి, మళ్లీ ఇవాళ సిద్ధం పేరుతో ఏముఖం పెట్టుకుని విశాఖలో అడుగు పెడుతున్నావు జగన్ రెడ్డి అని నిలదీశారు. గతంలో చంద్రబాబు విజన్ తో గంగవరం పోర్టు నెలకొల్పి విశాఖ స్టీల్ ప్లాంట్ కు కన్వేయర్ బెల్ట్ తో కోకింగ్ కోల్ ను తరలించేలా ఏర్పాటు చేశారుగుర్తు చేశారు. హుదూద్ తుఫాను సందర్భంగా వారం రోజుల్లో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పునరుద్ధరించిన వ్యక్తి చంద్రబాబు అని పట్టాభిరామ్ కొనియాడారు.
ఫ్లోటింగ్ బ్రిడ్జిని సరిగ్గా కట్టలేని ఈ వైసీపీ ప్రభుత్వం: తండ్రికే గుడి కట్టలేని జగన్ ప్రజల గుండెల్లో ఎలా గుడి కడుతారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. విశాఖలో జనసేన పార్టీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని విమర్శించారు. అక్రమ మద్యం, ఇసుకతో వైసీపీ నేతలు ప్రజల సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే హామీ పూర్తిగా విస్మయించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జనన్మోహనరెడ్డికి ఉత్తరాంధ్రాకు వచ్చి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. కనీసం ఒక బస్ బే సరిగ్గా నిర్మించలేని ముఖ్యమంత్రి ఫ్లోటింగ్ బ్రిడ్జిని సరిగ్గా కట్టలేదని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ పర్యటనలో మహిళల ఇక్కట్లు - 'పాల్గొనకుంటే 50రూపాయల ఫైన్'
జగన్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు: టీడీపీ