TDP Leader BTech Ravi Petition on High Court:మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంపై ఎవరు మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై వైఎస్సార్ జిల్లా పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి హైకోర్టులో లంచ్‌మోషన్ అప్పిల్ చేశారు. లంచ్‌మోషన్ పిటిషన్‌ను విచారించలేమని రేపు మరో ధర్మాసనం చేపడుతుందని బెంచ్ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటీషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం బ్లూమ్ బర్గ్‌కేస్‌లో ఇచ్చిన తీర్పుకు ఇది పూర్తి విరుద్ధమని పిటిషనర్ తెలిపారు.
కేసుల వివరాలివ్వడానికి ఎంత సమయం కావాలి: హైకోర్టు - Cases on Political Leaders
ఎన్నికల సందర్భంగా వివేకా హత్య కేసుపై పలువురు రాజకీయ నాయకులు ప్రచారంలో మాట్లాడుతున్నారని వైసీపీ కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సురేష్ బాబు కోర్టులో వేసిన పిటిషన్పై 30వ తేదీ వరకు ఎవరూ మాట్లాడవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం విదితమే. ప్రధానంగా వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని పిటిషన్ వేయగా వారందరూ వివేకా అంశాన్ని ప్రస్తావించవద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.