TDP leader Bonda Uma Fires On Police :డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా ఒక పోలీస్ సిండికేట్‌గా ఏర్పడి తప్పుడు కేసులతో తనను నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశాపరు. ఒక నేరగాడికి కొమ్ము కాస్తున్న ఐపీఎస్‌లు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పోలీసులు యుద్దానికి వచ్చినట్టు తన ఆఫీస్ చుట్టుముట్టారని ధ్వజమెత్తారు. సీఎంపై గులకరాయి దాడిలో ఒక మైనర్ని తప్పుడు కేసు పెట్టి ఇరికించారని ఆరోపించారు. పోలీసుల వేధింపుల తో వేముల దుర్గారావు కనిపించకుండా పోయి ఆరు రోజులైందన్నారు. సీఎంపై గులకరాయి దాడిని సీబీఐ విచారణకు ఇవ్వాలని తాము డిమాండ్ చేశామని తెలిపారు. వేమల సతీష్‌తో బలవంతంగా 164 స్టేట్ మెంట్ తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
గులకరాయి కేసులో A1కి 14 రోజుల రిమాండ్ - A2 ఎవరో వెల్లడించని అధికారులు - Cm Jagan Stone Pelting Case
తనను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్న పోలీసులను వదిలిపెట్టనని బోండా ఉమ హెచ్చరించారు. మమ్మల్ని అక్రమంగా ఇబ్బందులకు గురిచేసిన పోలీసులు ఊసలు లెక్కపెట్టడం ఖాయమని స్పష్టం చేశారు. సతీష్, అతని కుటుంబ సభ్యులతో బలవంతంగా స్టేట్ మెంట్ ఇచ్చేలా ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. తమ పేర్లు చెప్పమని సతీష్, ఆయన కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. తన మీద చంద్రబాబు మీద కక్ష సాధించేందుకు కాంతి రాణా వడ్డెర కాలనీని ఇబ్బంది పెడుతున్నారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ వస్తే కాంతి రాణా సెల్యూట్ కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తప్పులు చేసిన అధికారులు ఎలాంటి శిక్ష ఎదుర్కొంటున్నారో కాంతి రాణా తెలుసుకోవాలని హితవు పలికారు. వేముల దుర్గారావు ప్రాణాలతోనే ఉన్నాడా? లేక వివేకాలా చంపేశారా? అని ప్రశ్నించారు. కాంతి రాణా వ్యవహరంపై హైకోర్టు సీజేకు మెసేజ్ పెట్టానన్నారు.