ఎన్నికల సమరానికి సై- టీడీపీ, జనసేన 'జెండా' సభకు సర్వం సిద్ధం TDP Jansena Election Campaign: తెలుగుదేశం - జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించి అధికారపార్టీకి సవాల్ విసిరిన కూటమి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా దిశానిర్దేశం చేయనున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోబోయే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు తరలిరానున్నారు.
తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు తాడేపల్లిగూడెం వేదికగా తొలి బహిరంగ సభ నిర్వహించనున్నాయి. బహిరంగ వేదికపై తొలిసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. రెండు పార్టీల క్యాడర్‌ను రాజధాని స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేసే ప్రధాన లక్ష్యమే ఎజెండాగా ఈ సభను నిర్వహిస్తున్నారు.
ఘాటెక్కిన గుంటూరు రాజకీయాలు - చంద్రబాబు నిర్ణయం కోసం ఆశావహుల ఎదురుచూపులు
ఈ తొలి ఉమ్మడి సభకు ‘జెండా’ అనే పేరును ఖరారు చేశారు. ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన నారా లోకేశ్ యువగళం - నవశకం ముగింపు సభలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కలిసి పాల్గొన్నప్పటికీ, అభ్యర్ధులను ప్రకటించాక ఎన్నికల ప్రచారం కోసం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభే.
వైఎస్సార్సీప అరాచక పాలన గురించి ప్రజలకు చెప్పడమే గాక తెలుగుదేశం - జనసేన గెలుపు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించనున్నారు. కార్యకర్తలు ఉమ్మడిగా కదనరంగంలో ఎలా పోరాడాలో అధినేతలు వివరిస్తారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు.
వైఎస్సార్సీపీ నాయకుల చర్యలకు క్రీడాకారులు బలి : టీడీపీ నేత కొల్లు రవీంద్ర
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలని, 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలు పడిన ఇబ్బందులను తొలగించాలని, బావితరాల శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లాలని పొత్తు పెట్టుకున్నట్లు ప్రతి ఒక్కరికి తెలుసు." -అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఓటు బదిలీ అంశం అధినేతల ప్రసంగాల్లో కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోను రెండు పార్టీల క్యాడర్‌కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోను అవకాశాలు లభించబోతున్నాయనీ స్పష్టం చేయనున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిల్లోనూ పరుగు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు.
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'
"ఇదొక జెండా పండగ, అద్భుతమైన పండగను చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకు మంచి సంకేతం, దిశానిర్దేశం చేయనున్నాం. పొత్తు వల్ల రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్ ఉంటుందో ఆ వివరాలు చెప్పబోతున్న తరుణం" -నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సమీపంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో ఇరుపార్టీల నేతలు పెద్దఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్‌లో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో ఈ సభ ఏర్పాటు చేశారు. సుమారు 6 లక్షల మంది హాజరుకానున్నట్లు సమాచారం.
మొత్తం 33 గ్యాలరీల్లో వీఐపీల కోసం మూడు, మహిళల కోసం మూడు, మీడియాకు ఓ గ్యాలరీని కేటాయించనున్నారు. దాదాపు 5 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేయనున్నారు. కార్యకర్తలు, అభిమానులు తమ వాహనాలు నిలిపేందుకు సభా ప్రాంగణానికి సమీపంలోనే భారీ పార్కింగ్ స్థలం కేటాయించారు. సభా ప్రాంగణంలో 14 డిజిటల్ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.
టీడీపీ-జనసేన బహిరంగ సభకు 'జెండా'గా పేరు