TDP Janasena BJP leaders election campaigning:వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థులు, విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నారు. అన్నిచోట్లా ప్రజల నుంచి తమకు విశేష స్పందన లభిస్తోందని నేతలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సపీ నుంచి భారీగా తెలుగుదేశంలోకి చేరికలు మొదలయ్యాయి.
గెలుపే లక్ష్యంగా జనంలోకి టీడీపీ అభ్యర్థులు- వైసీపీలో కొనసాగుతున్న వలసలు జగన్ విధ్వంసంతో ప్రారంభిచారు: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఆ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. చంద్రబాబును కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నాలుగు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలనను శుభకార్యంతోనో, అభివృద్ధి కార్యక్రమంతోనో ప్రారంభిస్తారు కానీ, జగన్ విధ్వంసంతో ఆరంభించారని లోకేశ్ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అపర్ణ అపార్ట్‌మెంట్ వాసులతో లోకేశ్ భేటీ అయ్యారు. హిందూపురం, కుప్పం నియోజకవర్గాలతో పోటీపడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు: విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలిసారిగా బరిలో దిగుతున్న బేబీ నాయనకు అపూర్వ స్పందన లభించింది. అనకాపల్లి నుకాలమ్మ ఆలయంలో జనసేన నేత కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
'మేం అనుమతి తీసుకోవాలా?!'- కోడ్ ఉల్లంఘించి వైసీపీ నేతల ప్రచారం, ర్యాలీలు
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశం: గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం దుగ్గిరాలలోని తన నివాసంలో వైఎస్సార్సపీ నుంచి వచ్చిన పలువురిని ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా తుని పురపాలక మాజీ ఛైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరిని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ అభ్యర్థి యనమల దివ్య కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన, బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్ విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు తూర్పు పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్- నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మీనా
తెలుగుదేశం పథకాలపై అవగాహన: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ స్వగృహంలో టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి సమక్షంలో 200 మంది టీడీపీలో చేరారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కందికుంట యశోదాదేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలే వచ్చే ఎన్నికల్లో, టీడీపీని అధికారంలోకి తీసుకు వస్తామని, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. నీలారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటా తెలుగుదేశం పథకాలపై అవగాహన కల్పించారు.
ఎన్డీఏ కూటమికి లోక్‌సత్తా మద్దతు- భవిష్యత్ ఆలోచించి నిర్భయంగా ఓటేయాలి: జేపీ