TDP Chief Chandrababu Delhi Tour:కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మరోసారి దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. కాసేపట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలను ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని సూచించారు. ఇప్పటికే దిల్లీ ప్రయాణంలో ఉన్న వారు మినహా మిగిలిన ఎంపీలు హాజరుకానున్నారు. రేపు జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు ఎంపీలతో కలిసి పాల్గొననున్నారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం ఎంపీలకి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని ఎంపీలకు కబురు పంపారు. కాసేపట్లో ఎంపీలతో బాబు సమావేశంకానున్నారు. అధిష్ఠానం పిలుపుతో ఎంపీలు తరలివచ్చారు.
164 బిందెలతో పాలాభిషేకం:చంద్రబాబును కలిసేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వచ్చారు. కూటమి 164 సీట్లు సాధించినందున యుగపురుషుడు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్ చిత్రపటాలకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు. సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించి భారీ మెజార్టీతో గెలిపించారని తన విజయం ప్రజలకు అంకితమని కలిశెట్టి తెలిపారు.
ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం! - CHANDRABABU WILL TAKE OATH AS AP CM ON JUNE 12
ఎన్డీయే కూటమి సమావేశంలో చంద్రబాబుకు పెద్దపీట: ఇటీవల ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలో బీజేపీ నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు బీజేపీ అగ్రనేతలు కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు, నీతీశ్‌కుమార్ కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు, నీతీశ్ సరదాగా మాట్లాడుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్‌షా చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పీయూష్‌గోయల్‌తో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో అరగంటపాటు చర్చించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు ఏపీ భవన్ కేంద్రంగా జరిగిన ఉదంతాన్ని అప్పట్లో ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు అదే స్థాయి ప్రాధాన్యం వచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్లు పలువురు వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు సీఎం అయితేనే ఆడపిల్లలకు రక్షణ- వైఎస్సార్సీపీ వేధింపులు భరించలేకనే వెళ్లిపోయాం' - YSRCP Victim Arudra
కూటమి విజయంతో టాలీవుడ్లో జోష్ - సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అభినందనలు - TOLLYWOOD JOSH WITH NDA WIN